ధార్మము... ధార్యము
*******
ధర్మ సంబంధమైన దానిని ధార్మం అంటారు. వ్యక్తులుగా పాటించాల్సిన ధర్మాలు సత్యనిష్ఠ,నీతి, నిజాయితీ, ఓర్పు, కారుణ్యం, వినయం నిష్కాపట్యం, త్యాగం మొదలైనవి.
వీటిని ఆచరించే వ్యక్తులను ధార్మికులు అంటారు.
ధార్మికుల వలన వారికి వ్యక్తిగతంగా ఆత్మ తృప్తి కలగడమే కాకుండా సామాజపరంగా కూడా మేలు జరుగుతుంది.
ధార్యము అంటే ధరింప దగినది, జ్ఞాపకముంచుకో దగినదని అర్థం.
మరి వేటిని ధరించాలి? విలువైన నగలు వలువలా..!
వేటిని జ్ఞాపకం ఉంచుకోవాలి?...ఎవరో ఏదో అన్నారని వారిపై కోపం, ద్వేషమా...! ఇవి కానేకావని గ్రహించాలి.
మానవీయ విలువలను ఆభరణాలుగా ధరించాలి. ఈ సమాజానికి ఉపయోగపడేవి, మంచి మార్గంలో నడిపించే విషయాలు,పనులేమిటో సదా జ్ఞాపకం ఉంచుకోవాలి.
అప్పుడే ఆచరించాల్సిన ధార్మానికి,ధార్యానికి న్యాయం జరుగుతుంది.ఉన్నతమైన సమాజం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి