అప్సరస చిలుక! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇంద్రసభలోకి ఖంగారు గాబరాతో అప్సరస వచ్చి గగ్గోలు పెట్టింది"ప్రభూ! నాఅందాల చిలుక ఎక్కడికో  ఎగిరి పోయింది. నలుగురు నౌకర్లు దాన్ని  కనిపెట్టి ఉంటారు. ఐనా వారి కంట్లో కారంకొట్టి పారిపోయింది." "మరి దానికి తిండి తిప్పలు  మంచి నీరు సమయానికి అందిస్తున్నావా?" "ఆపనులు చేయటానికి దాసీలున్నారు.ఆహారం నీరు సరైన సమయంలో అందించే ఓదాసి నిద్రపుచ్చేందుకు ఓదాసి కబుర్లు చెప్పే దాసి షికార్లు తిప్పేందుకు ఇంకో దాసి ఉన్నారు. " "దాన్ని పట్టించుకోకుండా నీ ఆటపాటలతో నీవు ఉంటావు.అందుకే  అది దాని కి నచ్చిన చోటుకి తుర్రుమని ఎగిరి పోయింది "."అయ్యో!ఎక్కడికి పోయింది ప్రభూ?" "నీఆటపాటలు గొప్ప కాదు.ఒక్క సారి  ఆభూలోకంకి వెళ్లి చూడు.వారంతా ఎలాఆటపాటలతో తమ జీవితాన్ని గడుపుతూ ప్రయోజనకరంగా తమ పనులుచేస్తున్నారో?" "సరే!నేనే స్వయంగా వెళ్లి చూస్తాను ప్రభూ!"అని అప్సరస భూలోకంలోకి వచ్చింది.
కొందరు పిల్లలు బావిలోంచి నీరుతోడి చెట్లకి పోస్తుంటే ఇంకొందరు పిల్లలు కొత్త మొక్కలు నాటుతూ పాటలు పాడుతున్నారు.చిలుక వారి దగ్గర చేరి కుప్పిగంతులేస్తోంది.దానికి ప్రేమతో గింజలు వేస్తూ పలకరిస్తున్నారు. "ఏయ్ చిలుకా! నన్ను విడిచి ఇలా భూలోకంలో కి  ఎందుకు వచ్చావు?""నేను నీతో రాను.ఈభూలోకంలో ఖుషీ గా ఉంటాను"అని తుర్రు న ఎగిరిపోయింది. కట్టెలుకొట్టేవాళ్లు పాటలు పాడుతుంటే అక్కడ వాలింది.కట్టెలమోపులు నావలో పెట్టి "హైలెస్సా!ఓలెస్సా!జోరుసేయ్!బార్ సేయ్"అనిపాడుతున్న వారి దగ్గరకు అప్సరస వెళ్లింది.చిలుక వారిదగ్గర వాలింది.దాన్ని పట్టుకోబోయిన ఆమె తో చిలుక అంది"ఈకష్టజీవులు ఎంత ఉల్లాసంగా పాడుతు ఆనందంగా ఉన్నారో!నేను రాను నీలోకానికి!" అని ఎగిరి పొలంలో పనులు చేస్తున్న  రైతులు  కూలీలవద్ద వాలింది.అప్సరస  అక్కడ దాన్ని పట్టుకోబోతే అది "చూడు!నీసుఖం సంతోషం  మాత్రమే నీవు చూసుకుంటావు.ఈకష్టజీవుల బతుకు కి ఓఅర్ధం పరమార్ధం  ఉంది. నీవు ఎంత ప్రయత్నించినా నేను నీకు చిక్కను."ఇక చేసేది ఏమీలేక అప్సరస  తన లోకానికి వెళ్లి పోయింది 🌷
కామెంట్‌లు