బెకబెక బడి ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
కప్పలు కప్పలు బెకబెక కప్పలు 
కప్పలు కప్పలు బెకబెక కప్పలు!! 

చిటపట చినుకులు రాలినకొద్దీ
జలజల నీళ్ళు పారినకొద్దీ
చకచక కప్పలు నడిచాయ్ ముందుకు 
కప్పలు కప్పలు బెకబెక కప్పలు 
కప్పలు కప్పలు బెకబెక కప్పలు!! 

కళకళలాడే ముఖాలతోనీ 
జిలిబిలి పలుకుల మాటలతోనీ 
పకపక నవ్వుతొ నడిచాయ్ ముందుకు
కప్పలు కప్పలు బెకబెక కప్పలు 
కప్పలు కప్పలు బెకబెక కప్పలు!! 

తికమక తింగరి పాటలు మానీ 
మకతిక నంగిరి మాటలు మానీ 
దబదబ కప్పలు నడిచాయ్ ముందుకు
కప్పలు కప్పలు బెకబెక కప్పలు
కప్పలు కప్పలు బెకబెక కప్పలు!! 

మిలమిల కన్నులు మెరుస్తుండగా 
మిసమిస రంగులు కాంతులీనగా
రకరకాల కప్పలు నడిచాయ్ ముందుకు
కప్పలు కప్పలు బెకబెక కప్పలు
కప్పలు కప్పలు బెకబెక కప్పలు!!

చరచర ముందుకు నడిచిన కప్పలు
తళతళలాడే పలకలు తీసుకు
రంగురంగుల పుస్తకాల్ తీసుకు
టకటక కప్పలు చేరెను బడిలో
కప్పలు కప్పలు బెకబెక కప్పలు
కప్పలు కప్పలు బెకబెక కప్పలు!!

కప్పల ఆటలు అన్నీ పోయె
కప్పల చదువు బాగుగ సాగె 
అప్పటినుండి బడిలో వినిపించెను
బెకబెక బెకబెక బెకబెకలు
బెకబెక బెకబెక బెకబెకలు!!


కామెంట్‌లు