సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  భవి...భావి
 *****
మన మనసు,శరీరానికి భవి మనమే అని గుర్తుంచుకోవాలి.భవిని బట్టే భావి జీవితం ఎలా ఉంటుందో చెప్పవచ్చు.
కోరికలు గుర్రాల వంటివి. ఇంద్రియాలు ఆశా పాశాల వంటివి. వాటిని నియంత్రించే పగ్గాలు మన చేతుల్లోనే ఉండాలి.లేదంటే మానసిక శారీరక అనారోగ్యాలు, అసంతృప్తులు పొడసూపే అవకాశాలు ఉంటాయి.
 భవి అంటే ఏమిటో చూద్దాం...భవి అంటే యజమాని,గృహస్తుడు,గృహి,గేహి,ఇంటికాపు మొదలైన అర్థాలు ఉన్నాయి.
గృహ యజమానిగా కుటుంబ పరిరక్షణ బాధ్యతలు చాలా ఉన్నట్టే, దేహ యజమానిగా సంరక్షించుకునే బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
అప్పుడే భవి యొక్క, వర్తమానం, భావి జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండగలదు.
 భావి అంటే అంటే భవిష్యత్కాలము అనే కాకుండా ఆప్తి,ఆయతి శ్వస్తము,భావ్యము,ఉదర్కము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
 ప్రస్తుత,భావి జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటే  భవి యొక్క సామర్థ్యం, దినచర్య, మంచి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు