ప్రతిభ! అచ్యుతుని రాజ్యశ్రీ

 పిల్లలు పెద్ద చదువు లేని కుటుంబాలలో పుట్టినా తమ సహజ తెలివితేటలు  చుట్టూ పరిస్థితులు గమనిస్తూ గొప్పవారు  అవుతున్నారు.మాష్టారు ఆవిషయం చెప్తూ లైబ్రరీలో పుస్తకాలు తలా ఒకటి ఇచ్చి  "పీరియడ్ లో చదివి  సాయం త్రం లాస్ట్ పీరియడ్ లో నాకు  ఆపుస్తకం గూర్చి వివరించాలి"అన్నారు.కొందరు పుస్తకం అడ్డుపెట్టుకుని  కబుర్లు చెప్పటం గమనించినా సార్ ఏమీ అనలేదు. కొందరు చాలా దీక్షగా చదివితే ఇంకొందరు పేజీలు తిప్పుతూ  ఎంత చదవాలో అంచనా వేయసాగారు.పీరియడ్ ఐపోగానే సార్ పుస్తకాలన్నీ తీసుకుని వెళ్లి పోయి లైబ్రరీలో పెట్టారు. ఆసాయంత్రం  అంతా చెట్లకింద చేరారు. క్లాస్ లేని టీచర్లు కూడా  వచ్చారు."ఉదయం  నేను పుస్తకాలు తలాఒకటి ఇచ్చాను.మీరు  చదివిన  విషయం ఎందుకు అది నచ్చిందో చెప్పాలి"అని సార్ అనగానే  ఓఐదుమంది తలాకాస్త తాము చదివిన  కథచెప్పారంతే! శివ అన్నాడు "సర్! నేను సైంటిస్టు మేఘనాధ్ సాహా గురించి చదివాను.అందులో నన్ను ఆకర్షించిన ముఖ్య విషయాలు ఇవి!6అక్టోబర్ న తుఫాను  జోరువర్షాలలో  ఢాకా లో పుట్టాడు. నిరుపేద కుటుంబం లో 5వసంతానం! 5వక్లాస్ తో చదువు కి మంగళం పాడాడు. కానీ హెడ్మాస్టారు స్థానిక వైద్యుని ప్రోత్సాహం తో  ఆచిన్నారి స్కాలర్షిప్స్ పొంది  అన్ని క్లాసుల్లో ఫస్ట్ రాంక్ సాధించాడు.తన11వ ఏట బ్రిటిష్ ప్రభుత్వంని ఎదిరించి స్కాలర్షిప్ పోయినా బాధపడలేదు.సుభాష్ చంద్రబోస్ సహాధ్యాయి.జర్మన్ భాష నేర్చి25వ ఏటనే డి.ఎస్సీ. పట్టాపొందాడు.నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ని నెలకొల్పారు. వరదలు కరువు కాటకాల నియంత్రణ గూర్చి దేశవిదేశీ పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశాడు. మన దేశంలో అణుశక్తి అభివృద్ధి ఆలోచన ఆయనదే!1952లో  స్వతంత్ర అభ్యర్థి గాఎం.పి.గా ఎన్నికైన తొలి శాస్త్రవేత్త!1956 ఫిబ్రవరి 16న పార్లమెంట్ వీధిలో నడుస్తూ ఉండగా తీవ్రమైన గుండె పోటుతో భౌతికంగా దూరమైనా ఆయన జీవితం నాకు  ఆదర్శం ". అంతే అధ్యాపకులతో సహా చప్పట్లతో ఆప్రాంతం  మారుమోగింది. హెడ్మాస్టారు  చాటునించి శివా చెప్పింది విని వెంటనే  తన జేబులోని కొత్త పెన్ ని వాడికి బహుమతిగా ఇచ్చారు. సైన్స్  సార్ వాడికి సైంటిస్టుల జీవిత చరిత్రలు బహూకరించాడు. మిగతా పిల్లలకి అప్పుడు బుద్ధి వచ్చింది"అరే! సార్ ఇచ్చిన పుస్తకం చదివి మనం చెప్పి ఉంటే కనీసం  మనకి గుర్తింపు వచ్చేది కదా అని 🌹
కామెంట్‌లు