అంతర్జాతీయ బాలికల దినోత్సవం; డాక్టర్ ; కందేపి రాణిప్రసాద్
  అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టోబర్ నెలలో 11) సందర్భంగా ఈ బాలిక ను పరిచయం చేస్తున్నాం. ప్రస్తుత సమాజం లో బాలికలు ఎంతో వివక్ష కు గురవుతున్నారు.పనిలో ఆహారం లో,చదువు లో, పెళ్లి లో,గౌరవం లో, ప్రతి పనిలో వివక్ష ఉంటుంది. ఆడపిల్ల పుడితే చంపేసి,ముళ్ళ పొదల్లో విసిరేసే రోజులు పోవాలి.ఆడబిడ్డ ను ఆనందంగా పెంచుకునే రోజులు రావాలి.ఆడబిడ్డ అని తెలియ గానే అబార్షన్ చేయించుకునే పరిస్థితి పోయి సంతోషంగా స్వీకరించే అవకాశాలు లభించాలి.ఈ బాలిక ను తయారు చేసిన వారు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్.దేవ దేవుడికి ప్రీతి పాత్రమైన పారిజాత చెట్టు యొక్క దళాలు మరియు విత్తనాల తో అమ్మాయిని సృష్టించారు. అపూర్వమైన సువాసనలు వెదజల్లే పారిజాత వృక్ష సంపద తో తయారు చేసిన ఈ బాలిక కూడా తన చుట్టూ ఉన్న సమాజానికి సువాసన వెదజల్లుతూ ఆనందాన్ని కలిగిస్తుంది.

కామెంట్‌లు