కోరాడ * మినీలు *

    @ ప్రశాంతత @
             ***
  ద్వేషం తో రగిలిపోయాడు !
 రక, రకాల రోగాలతో...
     అనారోగ్యంపాలయ్యాడు!!  
 తప్పు తెలుసుకుని... 
   పాస్చాత్తాపంతో... 
  ప్రేమించటంమొదలుపెట్టాడు! 
  ఆరోగ్యంకుదుటపడి,హాయిగా 
    ప్రశాంతంగా ఉన్నాడు...!! 
         ******
          @ భాగ్యవంతుడు  @
                  ***
 దాచుకోవాలనే... 
  తలంపు లేదు... !
  దోచుకోవాలనే... 
    ఆలోచనే రాదు.. !!
ఏరోజుకారోజు... 
 ఉన్నదానితో తృప్తిగా... 
   నిశ్చింతగా బ్రతుకుతున్నాడు 
వాడికంటే  భాగ్యవంతు -
   డెవడీలోకంలో.... !?
      ******-
   @ సంపాదన @
      ****
లెక్క తెలియనన్ని ... 
.. కోట్లు సంపాదించాడు.... 
              జైల్లో... ఉన్నాడు.. !
ఎంతసంపాదించామన్నదికాదు 
  ఎలా సంపాదించామన్నదే....
ముఖ్యం  !!
         *******
  అలువుడ్ని బలువుడు కొడితే 
.    @@@@@@@@@@
అమాయకుల్ని... వంచించి   చాలానే   సంపాదించాడు !
 నయవంచకుడెవడో  వచ్చి... 
   వీడు సంపాదించిందంతా... 
    దోచుకుపోయారు... !!
         *****
కామెంట్‌లు