తప్పుతాయి కదూ(చిత్రకవిత );-కోరాడ నరసింహా రావు
ఆసరాలేని బతుకు... 
 సహాయం కోసం దీనంగా... 
   పరులపంచన.. అరుగుమీద 

"వయసులో... సంపాదించి 
  దాచుకున్న  డబ్బైనా ఉండాలి 
   కన్న బిడ్డలైనా ఉండాలి... "
     అంటారేగానీ...., 
       
     అవి మాత్రం అక్కరకు వస్తా యన్న గ్యారంటీ లేదు కదా.... !

పట్టించుకోని కన్నబిడ్డలు... 
  ఎందరు  లేరు... !!
ఎంతడబ్బున్నా  వండి,వడ్డించి 
  ఆదరించేవారెందరుంటారు ?!

వృద్దాప్యంలో విధవయై,ఆడది  బ్రతికేయ గలదే మో గానీ...  విదురుఁడై.. మగవాడు...
   బ్రతకడం దుర్భరం... !

 కడదాకా తోడూ,గూడూవుండి 
 కూటికీ, గుడ్డకీ లోటులేకుండా 
  ఆరోగ్యంతో బ్రతక గలగటం... 
   అదెంత పుణ్యం చేసుకుంటే 
    అటువంటి జన్మ వస్తుంది !!

అందుకే.... దనాన్నీ, పిల్లల్నీ... 
 సంపాదించలేకపోయినందుకు 
  బాధపడకూడదు, 
  చాతనైనా మంచిపనులు చేసి 
 కాస్తంతపుణ్యాన్నిసంపాదించు కోలేక పోయామే... అని బాధ పడాలి... !

  ఇలాంటి బతుకుల్ని చూసైనా 
  పుణ్యానికి ప్రయత్నిస్తే... !
  ఈపాట్లు...మనకితప్పుతాయి కదూ.....!
      *******

కామెంట్‌లు