@ నిజమే....... !@ కోరాడ నరసింహా రావు
 నిజమే.... ! అసలైన సవాల్ 
కెపుడూ..... జవాబుల వాదోప       వాదాలుండవ్ !
 ఎదురుప్రశ్నల తర్క -  వితర్కా  లుండవ్... !!
 ఔనని...అంగీకరించి...
          వప్పుకోవటమే.... 
     ఆ సవాల్ కి జవాబ్... !
  అందుకే... మనపెద్దలు... 
  మాటకు సత్యము ప్రాణము..
 అన్నారు ... !
సత్యమెప్పుడూ నిత్యమైనదే.. 
  అది శాశ్వతమైనది !
  ఆదిశంకరాచార్య,గౌతమబుద్ధ
జీసస్ క్రీస్తు,వీళ్లందరికంటే ముం
దు గీతాచార్యశ్రీకృష్ణభగవాన్...
వీళ్ళoతా చెప్పిన ప్రతిమాట...
చెక్కు చెదరక సర్వకాల, సర్వా  స్థలకూ ఆమోద  యోగ్యములు
ఆచరణీయములైనాయి .... !!   
 "సత్యం భ్రూయాత్.... 
  ప్రియం భ్రూయాత్... 
 నభ్రూయాత్ సత్యమప్రియం"  
    ఎంతచక్కని బోధన !
మంచిని పెంచేవి... 
 విద్వేషాలను రగిలించేవీ... 
  మనమాడే మాటలే... !!
 ప్రశ్నించాల్సిందే....,అది 
 కేవలంసందేహనివృత్తికి మాత్రమే... !
ప్రశ్నించాల్సిందే...అది అన్యా  యాన్ని  నిలదీయటానికే !!
ఈర్ష్యా ద్వేషాలతోనో... 
   ఓర్వలేని అసహనం తోనో... 
    సహేతుకమైన విషయాలపై 
      నిర్హేతుక ప్రశ్నలతో నిందిస్తే 
      చిన్నబోయే దెవరు !?
       సిగ్గుతో తల దించుకునే 
        పరిస్థితి ఎవరికి... ?!

 అందుకే.... మనం ప్రశ్నిస్తూ... 
 సవాల్ విసిరామంటే...., 
  అటునుoడి ఎదురు ప్రశ్నలు 
   ఘాటుసమాధానాలకు... 
    తావుండరాదు... !
అలా మన సవాల్ ఉండాలంటే 
మనలో...సత్యము,న్యాయము
సహేతుకత ఉండితీరాల్సిందే!!
      ******

కామెంట్‌లు