విమల.. కమల.. నేస్తాలు
శ్రమలో కలిపెను హస్తాలు
ఆడపిల్ల లనిలేవు వివక్షలు
అదేకదా మరివిశ్వ రక్షలు
బడిలో చదివే పాఠాలు
ఇంట్లో వల్లె వేయుటాలు
ప్రథమ శ్రేణిలో పాపాయిలు
పంతుళ్లకి గొప్ప మోదాలు
అమ్మకి పనిలో సాయాలు
అలుపు తెలియక గేయాలు
నాన్నకి అందించు తువ్వాలు
కంచము లోపెట్టు బువ్వాలు
ఇంటికి వెన్నెల గువ్వలు
కంటికి కాంతుల తారలు
అందాలు ఒలికే పాపలు
పద్ధతి కలిగిన తీరులు !!
***------***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి