కందం:
*వృద్ధజన సేవ చేసిన*
*బుద్ధి విశేషజ్ఞుఁబూత చరితుడున్*
*సద్ధర్మశాలియని బుధు*
*లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగ ఁగుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద వృద్ధులకు, పెద్దవారికీ బుద్దిమంతుడై సేవ చేసే వానిని, మంచి చరిత్ర గలవాడని, మంచి ధర్మ మార్గంలో నడిచే వాడని తెలివైన వారు, గొప్ప వారు పొగుడుతారు.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ నాటి మన చుట్టూ ఉన్న సమాజంలో మనం నిత్యం చూస్తూ, వింటూ ఉన్న అనేక సంఘటనలు; వృద్దులు, పెద్దవారు, తల్లిదండ్రుల మీద జరుగుతున్న నిర్లక్ష్యానికి, ఎదురు దాడులకు ఎవరు సమాధానం చెప్పాలి. మనమే నేమో! ఎందుకంటే, మనం మన తల్లిదండ్రులను చక్కగా, మర్యాదగా చూసుకుంటుంటే, మన తాత అవ్వలను ప్రేమతో చూసుకుని ఉండివుంటే, ఇప్పటి యువత వారి తల్లిదండ్రుల పట్ల, సమాజంలోని వృద్దులపట్ల గౌరవంతో ఉండి ఉండే వారేమో. వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గాలి అంటే, మనతరం మన పిల్లలకు పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ, వృద్దుల పట్ల ప్రేమ, మమకారంతో మెలగడం నేర్పడం అత్యవసరం. వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గడానికి ఆ పరాత్పరుడు తన వంతు సహాయాన్ని మనకు అందిస్తాడని అశిస్తూ, అందించాలని ప్రార్థిస్తూ .... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి