గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (52);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అదృష్టం అంటే మన వాళ్ళందరికీ విపరీతమైన ధన ధాన్యాలు కలిసి రావడం  అనుకోకుండా, లాటరీలో కోట్లకు కోట్లు రావడం  లాంటివి అనుకుంటారు  అదృష్టము అంటే తన దృష్టిలో అంతకుముందు లేనటువంటి విషయం. ఎలాంటి అధ్యాపకుడు చిన్న తరగతులలో మనకు గురువులా  దొరుకుతాడో అని  అనుమానంతోనే ఇక్కడికి వస్తారు విద్యార్థులు.వచ్చిన తర్వాత తమకు నచ్చిన గురువు దొరికితే అంతకుమించిన గొప్ప ఆనందం జీవితంలో ఇంకేం ఉంటుంది.చాలా బడులలో  నాకు తెలిసినంతవరకు  తెలుగు ఉపాధ్యాయులు తీసుకున్న చొరవ బాధ్యత మరొకరు తీసుకోరేమో అనిపిస్తుంది. తాను పదవిని విడిచి వెళ్లిన తర్వాత కూడా ఆ విద్యార్థులకు జ్ఞాపకం ఉండాలి  అన్న ఆశయంతో పని చేసే వారు ఎంతమంది ఉంటారు. తాను ఊహించిన  పరిణతి చెందిన ఉన్నత ఉత్తమ ఉపాధ్యాయుడు ఆరుమళ్ళ కోటి రెడ్డి గారు  వారు తెలుగు భాషలో చక్కటి పాండిత్య ముండి అనేక రకాల విశ్లేషణలతో చెప్పగలిగిన జ్ఞానం. జ్ఞానానికి, విజ్ఞానానికి భేదాన్ని తెలియజేసి విద్యార్థుల మేధను పెంచే సహన శక్తి వారి సొంతం. అలాంటివారు రెడ్డి గారికి దొరకడం చాలా ఆనందం.  పిల్లలకు కావలసిన పాఠాలు చెప్పడంతో పాటు  పిల్లల ప్రవర్తనా నియమావళి ఎలా ఉండాలో ప్రత్యేకించి ఆయన మాటల్లో  మీరందరూ చదువులో ఉత్తమంగా తీర్చిదిద్ద బడుతున్నారు  దీనివల్ల నిజజీవితం ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా  అక్కడ కూడా జీవితంలో విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. పుస్తక జ్ఞానం కన్నా  వినికిడి జ్ఞానం వల్ల  కూడా రాని జ్ఞానం అనుభవ జ్ఞానం అని చెప్పేవారు. అనుకోకుండా ఒక రోజు  పిల్లలంతా భోజనాలు చేస్తున్న సమయానికి వచ్చి  ఏం చేస్తున్నారు అని అడిగితే  చూస్తున్నారు కదా మాస్టారు  భోజనం చేస్తున్నాం అనగానే చూస్తున్నారా  ఆ చూసేది ఏమిటో నీకు తెలియాలిగా  అందుకనే ప్రశ్నించాను. నీవు తినే ఆ ప్రతి మెతుకు ఎక్కడి నుంచి వస్తుంది ఒక రైతు  ఆరుగాలం కష్టించి ఎండలో వానలో చలిలో  నీ కోసం పండించేస్తున్నాడురా. ఆ రైతు కష్టం నీకు తెలిస్తే  భోజనం అలా చేయవు ఒక మెతుకు పోతే బ్రతుకు నాశనం అవుతుంది అన్న దృష్టితో  ప్రతి వడ్ల గింజను ఏరి మనకు పంపిస్తాడు రైతు ఎంతో కష్టపడి. మనం కంచం చుట్టూ  ఎన్ని మెతుకులు ఉన్నాయో ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచిస్తే  ఆ రైతు బాధ మీకు తెలుస్తుంది.  ఆలోచనలతో కాదు  మీకు సెలవులు వచ్చినప్పుడు ఒకరోజు  రైతుతో పాటు వెళ్లి పొలంలో ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు కూడా అది చేస్తే  ఆ కష్టం మీకు అర్థమవుతుంది.
అలా వుంటుంది ఆయన విద్యా బోధన.

కామెంట్‌లు