పల్లవి: బాలలం మేం బాలలం
భావిభారత పౌరులం
పిల్లలం మేం పిల్లలం
పసిడి పువ్వుల నవ్వులం //2//
చరణం1: చక్కని చదువులు చదివేస్తూ
చల్లగా మేం ఎదుగుతాం
చక చక అడుగుల నేస్తూ మేము చంద్రున్నే అందుకుంటాం //2//
"బాలలం"
చరణం2: అందమైన ఆలోచనలతో మేము
ఆకాశాన్ని తాకుతాం
ఆకర్షణీయా ముఖముతో
అంతా మేమే కనిపిస్తాం
"బాలలం"
చరణం3: మా చాచా నెహ్రూ మాటల్లో మంచిని మేము గ్రహించి మలినం లేని మనసుతో మనుషులుగా మెలుగుతాం
"బాలలం "
చరణం4: పట్టుదలతో పరిశోధన చేసి
ప్రకృతి మాత బిడ్డలౌతాం
జయహో జయహో బాలక అంటూ
జనని భారతి రక్షణకులమవుతాం
"బాలలం"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి