*నీతి కథ:-(తేటగీతులతో)*;-మమత ఐలహైదరాబాద్--9247593432
 1వ భాగం
తే.గీ
కాకి కన్నీటి బొట్లను కార్చుచుండ
చెట్టు పైనుండి నొకబొట్టు చినుకు వోలె
తపము జేసేడి మౌనికి తగిలిపిలువ
చెట్టు దిగివచ్చి తనగోడు జెప్పు చుండె
తే.గీ
కాకిరూపంబు నలుపనే కథలుగాక
కాకి గోలగానరుపులన్  గాంచు చుండ్రు
కాకి పాదాలు తగిలిన శోకమనుచు
తక్కువగజూసి నుష్ నుచు తరుముచుండ్రు

కామెంట్‌లు