మా మదనపల్లెలో **నేటి భాగ్యం ;-కొప్పరపు తాయారు;- సెల్ --9440460797
        పొగమంచు తెరల దోబూచులాడ
        ఝల ఝల, జారు జలతారు తెల్ల
        పరదాల తళుకులు కాన రాగ,మది
        మౌన గీతం ఆలపించె మనసు నిండా!!

        కాన రాని రూపం తెరల వెనుక కవ్వించ,
        కాన లేము నిను కనుల పండువగా 
        ప్రత్యక్ష దైవమా పాలుమారకుమా,
        దయతోడ  మము కరుణతో దీవించవయ్యా!!

        ప్రాణములు కడతేర్చు చలి  కరుణ
        లేని  కరకు బాహువులలో నలుగుడువడ
        దర్శనమీయవా  దయగల భాస్కరా!!
        నీదు నును వెచ్చని కిరణాల తానాలు సేయ
        ఆ ఆనందాలు అనుభవించ అదృష్టమీవ!!

       అపరనారాయణమూర్తి, ఆది దైవమా,
       అందరి ఆరాధ్య దైవమా, నీదు ప్రత్యక్ష
       దర్శనమున,పులకించె ప్రకృతి ,తన పల్లవించు
       పచ్ఛదనాల రంగుల ముదమార వీక్షించ
       కదలి రాగదయ్యా కమనీయ హృదయా!!!

       ఓ ఆదిత్యా  అనన్య రూప  నీదు దర్శనం
       మాకు మహా అదృష్టమయ్యా!!!కామెంట్‌లు