ప్రభాతసూర్యుడు పక పక నవ్వాడు!
తేరి చూచి కరుణించి రావా అంటే,
కరుణలేని భాస్కరుడు కసురుకున్నాడు,
ఏమి తప్పని ఎదురించి ప్రశ్నించ !!
నా కాంతి పుంజాల కడ్డేల నీవు అన్నట్టు
గల గల గలా నవ్వే నా దైవము!
ఇది యేమి చోద్యమని దయ జాప మంటి!
దరిలేని లోకాన దారి లేని దాన్ని,!
కరుడుగట్టిన. హృదయమా కదలిక లేదా!
అంబరమున ఆనందహేల అందరి దైవం నీవే
నీ కాంతి పుంజాల వేడిమి తట్టుకోగలనా!!
నే నెంత,నా ప్రాణమెంత, కరుణించు !
దయజూపి దారి జూపయ్య !,నా స్వామి
నా ప్రార్థనలు మన్నించవా , ఆశీస్సులీవా!
శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ
లోక రక్షామణి పాహిమాం పాహిమాం !!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి