ప్రకృతిలో పాలుపంచుకున్న,
ప్రతీ కదలికున్న ప్రతీ ఊపిరున్న ప్రాణీకీ
భగవంతుని. వర ప్రసాదం, జ్ఞానం
కో కొల్లలు,
వాటి వాటి. జీవన విధానం లో
వాటి నైపుణ్యం. దర్పణం లో బింబంలా
ప్రతిబింబిస్తుంది , ఇది. సహజం,
ఉన్నదానితో తృప్తి పడక
కొత్త ఉత్తేజాన్ని సంతరించుకుని
సంకల్పించుకుని. నవ్యతతో
నిజాయితీ తో నలుగురూ మెచ్చే టట్టు
పరిమళించే ప్రతిమనిషీ
మహనీయుడే అందుకే త్యాగరాజు అన్నారు
ఎందరో మహానుభావులు అని
అందరిని అనుసరించి అలరించే
జ్ఞానాన్ని
సంతరించుకుని,నా వారని, నీ వారని
ద్వేషభావం లేకుండా
నవసమాజానికి నవ్యతని నింపుతూ,
ముందుకు సాగడమే
ప్రయత్నం, ప్రయత్నం తో సాధించలేనిది
ఏదీ లేదు ఈ సృష్టిలో
నవ్యతతో నాణ్యత తో మచ్చలేని
మనుగడ మహాద్భుతం,
ఆలోచించు,. ఆలోచింజేయి
మంచిని
ఆచరించు. ఆచరింప చేయి. అందరి
హృదయాలను జయించాలి
అంటే
మధుర సంగీతం లా,మరువలేని
అమ్మ ప్రేమ లా
నిలచిపోవాలి. దిగ్ దిగంతాల లో
శాశ్వతంగా
పూను కో ప్రత్యక్షం గా నో పరోక్షం గా నో
మహోతృష్టమైన కార్యాన్ని ప్రగతిపధం లో
. విజయం సంపాదించుకో
నవ్యతతో కూడిన నవ చైతాన్యాన్ని
ఉపయోగించి.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి