బాల పంచపది
=============
1. ప్రపంచ పర్యాటక ప్రదేశము!
అభివృద్ధి టూరిజము!
జాతీయ ఆదాయ,
సహాయము!
హోటళ్ళు , రిసార్ట్స్,
స్థాపనము!
పర్యటించు,
ఆనందించు ,రామా!
2. జమ్మూ కాశ్మీర్ ,
వాయువ్య ఉత్తరాన!
దక్షిణం, ఉత్తర ప్రదేశ్,
హర్యాన!
ఉత్తరాఖండ్ ,
ఆగ్నేయాన!
టిబెట్ (చైనా ),
తూర్పున!
పర్యటించు ,
ఆనందించు ,రామా!
3. నాలుగు ప్రధాన నదులు!
తూర్పున సట్లెజ్ సొగసులు!
పశ్చిమం చీనాబ్ ,
రావి, బియాస్ లు!
కొన్ని శాశ్వత,
మంచున్న నదులు!
పర్యటించు ,
ఆనందించు, రామా!
4. విభిన్న జాతి, భాష,
సమూహాలు!
జనాభాలో అధికం,
. హిందువులు!
చక్కగానే ఉన్నారు,
బౌద్ధులు!
తోడు, సిక్కులు,
ముస్లింలు, క్రైస్తవులు!
పర్యటించు ,
ఆనందించు, రామా!
5. దేవ్ భూమి, వీర్ భూమి,
ప్రసిద్ధి!
కులూ దసరా,
ఆనంద లబ్ది!
భీమా కాళీ ఆలయం,
దైవ సిద్ది!
హస్తకళలు,, టోపీలు,
చూడబుద్ధి !
పర్యటించు ,
ఆనందించు,రామా!
6. కైలాష్ జోర్కండేన్,
శిఖరము !
పార్వతీ లోయ,
తోష్ సమీపము !
స్పితిలోని,
కీలకమఠము!
రాత్రి సిమ్లా,
ధర్మశాల స్టేడియము!
పర్యటించు,
ఆనందించు, రామా!
_________
మంచు వాలులు రాష్ట్రము;-డా. పి.వి. ఎల్. సుబ్బారావు,- 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి