బాల పంచపది
============
1. ఉత్తరప్రదేశ్ తూర్పున!
హెచ్.పి., పంజాబ్ ఉత్తరాన!
రాజస్థాన్ దక్షిణాన ,
రాజధాని ఢిల్లీ ,పశ్చిమాన!
హర్యానా ,
కురుక్షేత్ర దర్శనము, రామా!
2. శివాలిక్, ఆరావళి శ్రేణులు!
యమునా సరస్వతీ నదులు!
నాలుగు ప్రధాన భాగాలు!
చండీఘర్ రాజధాని,
ద్వి రాష్ట్రాలు!
హర్యానా,
కురుక్షేత్ర దర్శనము, రామా!
3. హర్యానా హిందీ మాట్లాడే,
భాగము!
సాంస్కృతిక వారసత్వ,
రాష్ట్రము !
వేద కాలం తెలిపే,
వారసత్వము!
యోగా, ధ్యానం, మంత్రం,
కొనసాగడము!
హర్యానా,
కురుక్షేత్ర దర్శనము ,రామా!
4. చమలీవన,
దర్శనము!
లోకోమోటివ్,
మ్యూజియము!
బువాతాలా,
తాలాబ్,నిర్మాణము!
ఝజ్జర్,
పక్షుల సమావేశము!
హర్యానా,
కురుక్షేత్ర దర్శనము, రామా!
5.సింధూ నాగరికత,
నిదర్శనాలు!
హరప్పా సంస్కృతి,
ఆధారాలు!
అనేక పురావస్తు,
తవ్వకాలు !
సరిశిల్పాలు ,
ఆభరణాలు!
హర్యానా,
కురుక్షేత్ర దర్శనము , రామా!
6. లోహ్రీ పండుగ,
ప్రసిద్ధము!
సూరజ్ కుండ్,
కళా ఉత్సవము!
సూర్య దేవాలయ,
దర్శనము
ఖ్యాజఖిజ్ ,
సమాధి పవిత్రము!
హర్యానా ,
కురుక్షేత్ర దర్శనము, రామా!
7. పాల ఉత్పత్తి,
గణనీయం!
పాల ఉత్పత్తుల,
మాధుర్యము!
తేలిక,
పౌష్టికాహారము!
చక్కని చిక్కని,
లస్సీ పానము!
_________
భూతల స్వర్గము!;-డా. పి. వి. ఎల్. సుబ్బారావు, 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి