అంకింత భావం ముఖ్యం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
షేక్స్పియర్ నుంచి  మన పెద్దల వరకు చెప్పే ఒకే ఒక మాట  ఏ వ్యక్తి అయినా బాగుపడడాన్ని కానీ చెడిపోవడానికి కానీ కారణాలను అన్వేషించినప్పుడు  తన చుట్టూ ఉన్న స్నేహ బృందం వల్ల  లేదా తన జీవితంలో జరిగిన  సంఘటనల వల్ల  మార్పు వస్తుంది అని చెప్తూ ఉంటారు  నలుగురు తాగుబోతులు స్నేహితులైనప్పుడు అతనికి తాగుడు మీద తప్ప మరొక ధ్యాస ఉంటుందా? ఎవరికైనా ఏ వ్యసనం ఉన్నవాడైనా అదే వ్యసనంతో ఉన్న వాడి స్నేహితుడు దొరికినప్పుడు ఆ వ్యసనం ఉన్నవాడికి రెట్టింపు అవుతుంది  ఇది అందరికీ తెలిసిన విషయమే  అయితే దానిని తెలుసుకోవడానికి ఆస్కారం లేదా  ఆ మహమ్మారి నుంచి బయటపడడానికి అవకాశాలే లేవా అంటే ముందు తను మారాలి అని తాను అనుకోవాలి  ఆ తర్వాతే ఎన్ని ప్రయత్నాలు చేసినా
ముందు ప్రకృతిని తెలుసుకోవాలి  ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ప్రవృత్తి ఉంటుంది  అతని అలవాట్లు  ఎందుకు అలా చేస్తున్నాడు  అన్న దాన్ని కూలంకషంగా తెలుసుకున్నట్లయితే  నీవు మంచి వాడివైతే మంచి అలవాట్లు ఉన్న వాడితోనే స్నేహాన్ని చేయాలని కోరుకుంటావు  లేదు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆ గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయా అని వెదకటం ప్రారంభిస్తాం  అలా వచ్చినటువంటి అలవాట్లు మంచిగాని, చెడుగాని  జీవితాంతం ఉంటాయి  ఇతను మంచివాడు అని తెలిసి అతని స్నేహం ప్రారంభించిన తర్వాత  జీవితాంతం ఆ స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడకూడదు చిన్న చిన్న పట్టింపులు రావచ్చు, మధ్య మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఉండవచ్చు  అయినా మనసులు దూరం కాకూడదు  అలా ఉన్నప్పుడే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది.
భక్తి నిలపడం అన్నదాని మీద  శ్రద్ధ పెట్టాడు వేమన. భక్తి అంటే  అంకిత భావం దేనిని తాను చేయాలనుకున్నాడు దానిమీదనే కేంద్రీకరించి  మరొక ఆలోచన లేకుండా చేయడం  అది స్నేహం కావచ్చు, భగవంతుడి మీద భక్తి కావచ్చు  మరొకరి మీద అభిమానము కావచ్చు  అసలు ఈ భక్తి లేని వాడికి  ఎన్ని చెప్పినా లాభం ఉంటుందా  ఏదైనా మనం చెప్పింది వినేవాడు ఉంటే  మనసు విప్పి మాట్లాడి ఈ మంచి మార్గంలో వెళ్ళు అని సలహాలు ఇస్తాం  అలాకాకుండా మంకు పట్టు పట్టి  ఇది నాకే తెలుసు మరి ఎవరికి సాధ్యం కాదు అన్న అహంతో ఉన్నవాడికి  నీవు ఎన్ని చెప్పినా  అతని మనసు పట్టించుకోదు ఈ విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ  వేమన తన ఆటవెలదిలో  మనకు అందించిన పద్యం మీరు కూడా చదవండి.

"సజ్జనుల చెలిమి జాలింపగా రాదు  
ప్రకృతి నెరుగక నున్న భక్తి లేదు  
పలవలెట్టు రీతి భక్తి నిలుపుదురయా..." 



కామెంట్‌లు