చిట్టి చేతుల సందడి - పల్లెటూరి సరదా
ఎండలు కాసినా.. చిగురు నవ్వుల చల్లదనం,
పల్లె గాలిలో.. పసిపిల్లల కలకలం!
బోరు బావి ధార.. అమృతపు జల్లులై కురుస్తుంటే,
తొట్టిలో నీటి అలలు.. తన్మయంతో ఉరకలు వేస్తుంటే!
వయసు మరిచిన ఆటలు..
వన్నె తగ్గని పల్లెటూరి జ్ఞాపకాలు.
రెండు వేళ్లతో 'విజయాన్ని' చూపిస్తూ,
అమాయకత్వానికి ప్రతిరూపాల్లా మెరుస్తున్నారు ఈ చిట్టి పాపలు.
నిజమైన సంతోషం అంటే..
కోట్ల ఆస్తిలో లేదు,
ఈ నీటి తుంపరల దోబూచులాటలో ఉంది!
సెలవులు రావడంతో పొలం వద్ద చిన్నారుల సందడి
@వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలోని పల్లె తల్లి చిత్రం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి