లోచూపు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ భూ ప్రపంచంలో ఏ జీవి అయినా పంచభూతముల చేత ఏర్పడిన  ఆకారమే  పంచభూతాత్మకమైనది ఈ మానవ శరీరం అలాంటి శరీరానికి పంచ ఇంద్రియాలు ఉంటాయి  చెవి ముక్కు నోరు  కన్ను  చర్మం  శరీరం (తనువు) అంటేనే  ఏ కదలికలు లేకుండా  నిద్రాణమై ఉండేది ఈ తనువుకు  జీవి వచ్చి  కలిసినప్పుడు  జీవితం  జీవి తనువుల కలయిక అని అర్థం  లోపల జీవము లేకుండా ఈ తనువు ఏమి చేయలేదు  చెవికి వినికిడి జ్ఞానం ఉండదు  నోటికి మాటలు రావు, శరీరానికి స్పర్శ ఉండదు, కంటికి చూపు ఉండదు , ముక్కుకు  శ్వాస ఉండదు  ఆ ఐదు ఇంద్రియములకు జీవాన్ని ఇస్తుంది కనుక వాటిని  జ్ఞానేంద్రియములు అన్నారు  పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు కలిసి  మానవుని ఉనికిని తెలియజేస్తాయి. భౌతిక శరీరం నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్లాలనుకున్న ప్రతి వారు లోచూపు కోసం ప్రయత్నం చేస్తారు. బ్రహ్మ స్వరూపాన్ని చూడాలంటే  మామూలు కంటికి కనిపించే పదార్థం కాదు ఎంత చిన్నగా ఉంటుందో శాస్త్రజ్ఞుడు  ఎంతో శక్తివంతమైన యంత్రసహాయంతో మాత్రమే చూడగలుగుతారు  దానిని మనం మామూలుగా చూడడం ఈ జన్మకు లేదు  దానికోసం మునులు  తపసిద్ధి కోసం ఋషిగా, వెదర్షి, బ్రమర్షి గారు తయారవుతాడు  ఆ చివరి స్థితి వచ్చేటప్పటికి అంతర్గతంగా జీవి పైన ఉన్న చిన్న మొలక వెలుగు కనిపిస్తుంది ఆ స్థితి రావడానికి చాలా సంవత్సరాలు తపస్సు చేయాలి  తనను తాను మరిచి  దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడో దానిని వెతకడం కోసం మాత్రమే  దృష్టి పెట్టిన వారికి అది కనిపిస్తుంది.
చూసే కన్నులు వేరూ చూపు వేరు  ఆ రెండు  వేరు వేరు  ఈ బ్రహ్మాస్వరూపాన్ని చూడాలంటే లోచూపు ఉండాలి అని చెప్తారు వేదాంతులు. తనను తాను ఎక్కడ ఉన్నాడో వాటిని తెలుసుకోవడం  కోసం చేసే ప్రయత్నం  తనను తాను తప్పించుకుంటూ  దృష్టి మరల్చనీయకుండా  కేంద్రీకరించి అంకితభావంతో చేయగలిగినప్పుడు మాత్రమే  అది సిద్ధిస్తుంది అని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. ఏర్పేడు మలయాళ స్వామి వారి దగ్గర నుంచి  తిరువన్నామలై రమణ మహర్షి వరకు  ప్రతి ఒక్కరూ  అలా తనను తాము తెరుచుకున్నవారే అందుకే వారు బ్రహ్మర్షులు, బ్రహ్మను తెలుసుకున్నవారు అని చెబుతారు మన పెద్దలు  మామూలు వ్యక్తికి రుషికి అదీ వ్యత్యాసం  సామాన్యుడు కూడా ఆ రహస్యాన్ని తెలుసుకుని చేస్తే తప్పక విజయాన్ని సాధిస్తాడు  అని చెప్పుతాడు వేమన.

"ఇట్టి కనుల బ్రహ్మ మెట్టు చూడగవచ్చు  
జూచు కనులు వేరు చూపు వేరు  
చూపులోన నుంచి చూడంగా వలవదా..."


కామెంట్‌లు