మానవ జన్మ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ మనిషి అయినా తాను ఏ గర్భంలో జన్మించాలో ఏ తల్లి  తనకు కావాలో అని అనుకొని జన్మను పొందదు గర్భస్థ శిశువుగా ఉన్న అతని కుటుంబం హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు తర్వాత నాలుగు వర్ణాలలో ఏ వర్ణమైన కావచ్చు  ఎప్పుడు తన జన్మ ఈ భూమి మీదకు వస్తుందో  అప్పటికి  అతనికి పేరు లేదు బట్టలు లేవు  అదే మరణించిన రోజున  ఉన్న బట్టలను తీసివేసి కాలుస్తారు  కనుక అతని మనసులో ఉన్న అభిప్రాయాలను  కార్యరూపంలో పెట్టాలి అన్న  ఆలోచన అతనికి రాదు. కారణం అది అతని చేతిలో లేదు. ప్రకృతి అనండి, దేవతనండి, భగవంతుడనండి  లేదా సంచిత  జన్మ  ఫలం అనండి  ఏ పేరు పెట్టినా జరిగేది అదే  ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి ఈ భూమి లోపలకు వెళ్లి తీరవలసినదే  ఏ మతం చెప్పినా, ఏ జాతి చెప్పినా విషయం అదే. ఆ మానవునికి ఊహలు తెలిసి  వయసులోకి వచ్చిన తర్వాత తాను చేయవలసిన కార్యక్రమాలు ఏమిటో  ఒక్కొక్కటి బోధపడతాయి  మానవునికున్న నాలుగు అవస్థలు  బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము  ఏ దశలో ఏది ఎలా జరగాలో అన్నీ శాస్త్రీయంగా జరుగుతాయి. బాలుడిగా ఉన్నప్పుడు చదువుకుంటాడు  కౌమారంలో ఆడుకుంటూ ఉంటాడు. యవ్వనంలో వివాహం చేసుకొని కుటుంబ  సౌఖ్యాలతో పాటు బిడ్డలను కూడా  పొందుతారు. చివరి వృద్ధాప్య దశలో  కూర్చోవడం చేతకాదు, నిలబడడం చేతకాదు  భోజనం చేయడానికి కూడా సత్తువలేని స్థితిలో  మంచం పైన పండుకొని గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ ఏ క్షణాన నాకు మృత్యువు వస్తుందో అన్న  భయంతో బ్రతుకుతాడు  ఆ భయంతో చనిపోయిన వారు ఉన్నారు. తనకు తెలిసి తన గ్రామంలో తనతో సన్నిహితంగా ఉన్న మిత్రులు  ఆప్యాయంగా ప్రేమగా చూసే బంధువులు  కుటుంబ సభ్యులు తాతలు ముత్తాతలు  వీరులో చాలామంది ఈ సంవత్సరం, కొంతమంది పోయిన సంవత్సరం, మరి కొంతమంది ఆ క్రితం సంవత్సరం ఇంకొంతమంది చనిపోవడం కళ్ళారా చూచి వారి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చిన మనిషి నిన్న మొన్న కూడా ఎంతమంది చనిపోయి ఉండరు  వారందరూ కూడా చరిత్ర కలిగిన వారే కదా  మహాత్మా గాంధీ నుంచి రామకృష్ణ పరమహంస వరకు ప్రతి ఒక్కరు ఈ భూమి మీద తిరుగాడే ప్రతి దివ్య జంతువు  చనిపోయి తీరవలసినదే  ఏ రోజున మనం ఈ భూమ్మీదకి వచ్చామో ఆ రోజునే తన  మరణాన్ని కూడా బ్రహ్మ వ్రాస్తాడు అని మన పెద్దలు మనకు చెబుతారు  కనుక మరణ భయం కలిగిన మనుషులను ఎద్దేవా చేస్తూ  సహజంగా జరిగే విషయాలను కూడా పట్టించుకుని బాధపడేవాడు ఎంత అల్పులో అనే ఆశ్చర్యపోతాడు వేమన  అందుకే ఈ పద్యం మన ముందుకు వచ్చింది మీరూ చదవండి తెలుస్తుంది.

"మరణమన్న వెరసి మది కలంగగనేల  
నిరుడు ముందటేడు నిన్న మొన్న  
తనువు వీడినతడు తన కన్న తక్కువా..."కామెంట్‌లు