భగవంతుని సేవే ముఖ్యం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ ప్రకృతి  చాలా విచిత్రంగా ఉంటుంది  ఈ శరీరం  భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తుంది అని  మానసిక విశ్లేషకులు చెబుతారు. అమ్మ కంచంలో అన్నం పెట్టిన తర్వాత బోక్త హాయిగా భోజనం చేస్తారు. దీనికి ఏది ఉపకరిస్తుంది  అమ్మ పని గట్టుకుని కూరలు కోసి  దానికి కావలసిన సరంజామా  సమకూర్చుకొని  పొయ్యి దగ్గరకు వెళ్లి పోపుతో సహా అన్నీ సిద్ధం చేసుకుని  కూర తయారు చేస్తుంది. దానికి వంట పాత్రలు కావాలి  మంట కావాలి  వడ్డించటానికి హస్తం కావాలి అది తినేటప్పుడు తన చేతులు పని చేస్తాయి  నోరు పనిచేస్తోంది పండ్లు పనిచేస్తాయి లాలాజలం పని చేస్తుంది  ఆ ఘనపదార్థం జీర్ణమై బయటకు వెళ్లేంతవరకు కూడా శరీరంలో ఉన్న ప్రతి అంగము తన బాధ్యతగా అన్ని  సహకారాలను అందిస్తాయి. అది శరీర లక్షణం.
భాగవత ప్రబంధాన్ని వ్రాస్తూ బమ్మెర పోతన  గారు ప్రహ్లాదునితో అద్భుతమైన పద్యాన్ని చెప్పించాడు. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం భగవంతుడు ఇచ్చినది కనుక భగవంతునికే ఉపయోగించాలి. చేతులను ఇచ్చినది పూజ చేయడం కోసం, నోరు ఇచ్చినది వారిని గురించి ప్రస్తావన తీసుకురావడం కోసం, చెవులను ఇచ్చినది వారి గురించిన మంచి మంచి విషయాలను, వారి జీవిత కథనాలను వినడం కోసం ఈ శరీరం మొత్తం వారు ఇచ్చిన ప్రసాదం కనుక దానిని నైవేద్యంగా ఉపయోగించాలి. ఒక పరిణతి చెందిన అతి చిన్న వయస్కులు అతి పెద్ద వయసులో ఉన్న రాక్షసునికి  ఉపదేశించిన  గాయత్రి మంత్రం అది మరి పోతన అంటేనే తన తత్వమును పో అని పారద్రోలి  శ్రీరామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి వారేనన్ను ఆధారం చేసుకుని  ఈ గ్రంథాన్ని ప్రపంచానికి అందించారు అని మనవి చేశాడు. అది వినయ శీలుర లక్షణం. ఇక్కడ వేమన ఏం చెప్తున్నాడు  ఈ ప్రకృతి మనకు చెవులను ఇచ్చినది  మన పెద్దలు చెప్పిన మంచి విషయాలను విని అవగాహన చేసుకోవడం కోసం ఒకసారికి రెండుసార్లు చెబితే మనకు అర్థం కాకపోవచ్చు పాటికి పది సార్లు పెద్దలు  పనిగట్టుకొని చెప్పినప్పుడు  ఎందుకు ఈ వాక్యాన్ని ఇన్నిసార్లు చెబుతున్నారో అని ఆలోచన నీకు కలిగితే ఆ శబ్దానికి అర్థం కాదు కావాల్సింది, ఆ శబ్దము లోపల ఉన్న అంతర్గత విషయాలను అర్థం చేసుకొని  ధర్మము లేక ధర్మసూక్ష్మములు కూడా తెలిసి జీవితాన్ని ఆ పద్ధతిలో మలచుకో అని చెప్పడం కోసం  సమాజంలో అజ్ఞానంగా ఉన్న యువత కోసం ప్రత్యేకంగా వ్రాసిన ఆటవెలది ఇది  కనుక దానిని శ్రద్ధగా చదవండి అర్ధాలే అవగాహన చేసుకోండి  తరువాత ఆచరించండి  ఆచరణ కోసం మాత్రమే ఈ పద్యాన్ని చదవండి.

"శ్రవణపుటములున్న సార్ధక్యమేమిరా  వినగవలయు 
పెద్దలనెడి వన్ని  
వినగ వినగ నీకు విశదంబుతత్త్వము..."


కామెంట్‌లు