గౌరవ మర్యాదలు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
ప్రేమ అభిమానం ఆత్మీయత  ఈ పదాలన్నీ ఎవరికి వర్తిస్తాయి  తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య  అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళ కు మధ్య  భార్యకు భర్తకు మధ్య  మానవ లోకంలో తిరుగాడుతున్న  అందరితోనూ సమభావంగా మెలగడం ఒక్క మానవునికి అలవాటు. తనలాగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ మనం  గౌరవ మర్యాదలు ఇవ్వాలి అన్న ఆలోచనతోనే జీవిస్తూ ఉంటాము. ఇది స్వార్థముతో కూడినది కాదు  ధన ధాన్యాలతో కొన్నవి కావు అవసరాలను తీర్చుకోవడానికి  మంచి కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే స్థితి  కలిగిన వారి పైన ఇలాంటి ప్రేమలు కలుగవు. వారు వేషాలు వేస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. సామాన్యంగా అలాంటి వారిని దూరంగానే పెడతాం. వారు పలకరిస్తే తప్ప వీరు ప్రత్యేకించి వారి కోసం ప్రయత్నం చేయడు ఇది మానవ ప్రకృతి. మానవ జీవితమే కోరికల పుట్ట  కంటికి  నదరుగా కనిపించిన ఏ వస్తువునైనా తన సొంతం చేసుకోవాలని చూడడం అతని నైజం  అందమైన స్త్రీలను చూసినప్పుడు  ఆమె తన సొంతం  అయితే బాగుండును అనుకుంటాడు కానీ అది జరిగే పని కాదని తెలుసు అందుకే ఇష్టమైన వారకాంతలను ఎంచుకుని వారితో ఆకాంక్ష తీర్చుకుంటాడు ఏ వేశ్యామణి అయినా ఇతని అందచందాలకు  పేరు ప్రతిష్టలకు వాడు చేసే దానధర్మాలకు  ఆకర్షితురాలై అతని వెంట పడుతుందా  ఎందుకు ఆమె ఆ వృత్తి చేస్తుంది  గౌరవంగా జీవితాన్ని గడపడం తెలియకనా ఆమె ఆర్ధిక పరిస్థితులు కావచ్చు  కుటుంబ భారం ఆమె మీద పడవచ్చు  అలాంటివారు  కామంతో మోహంతో  మగ వాడిని ఆహ్వానిస్తారా అతని జేబులో ఉన్న బరువును చూసి  మోహాన్ని నటిస్తారు తప్ప  మనసులో అభిమానం కానీ ప్రేమ కానీ కలగదు ఉండదు.
ఈ స్థితిని పశువుతో, ఆమెను పోలుస్తూ  వేమన చెప్పిన విషయం  గేదె దగ్గరకు వెళ్లి పాలు తీయడానికి  పాత్రతో నీరు తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తే  అది అంటనిస్తుందా  ఒక్క తన్ను తన్నుతుంది అదే యజమాని  గేదె కడుపునిండా  ఎండు గడ్డి తో పాటు పచ్చగడ్డి కూడా వేసి మేపుతూ  చిట్టు తవుడు లాంటి పదార్థాలను కలిపి కుడితి తాగిస్తూ చక్కగా దానిని కడిగి శుభ్రంగా ఉండేటట్టు చేస్తే అప్పుడు నీ ఆశ ఫలిస్తుంది తప్ప  నీ ప్రయత్నం లేకుండా గేదె పాలు ఇవ్వదు  అలాగే వేశ్య కూడా  మీ కుటుంబాల్లో ఉన్న ఆస్తిపాస్తులు అన్ని తను చేజెక్కించుకున్న తర్వాత  ఆ గేదెలా తన్ని పాలు ఇవ్వకుండా ఉంటుందో అలా నిన్ను తరిమేస్తుంది  కనుక అలాంటి అలవాటులు చేసుకోవద్దు అని చెప్తున్నారు  వేమన. అది వారి స్వానుభవం  ఆ ఆటవెలదిని ఒకసారి చదవండి.


"కడుపునిండ తవుడు గంప లోబెట్టక 
చన్నుముట్టనీదు తన్ను బర్రె  వారకాంత విటుని వలచునా యూరక..."


 

కామెంట్‌లు