బాల్యం.....?--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.--సెల్ ;9948285353

 సంతోషాలు,సరదాలు అర్థం మారిన లోకంలో,
విజ్ఞానం,అభివృద్ధి వికృతమైన సమాజంలో,
విలువలు,ఆచరణలు మృగ్యమైన పరిసరాల్లో,
బాల్యం బందీ అవుతున్నది.
స్నేహం,కామం పర్యాయపదాలైన జీవనంలో,
ధనం,అహంకారం పేట్రేగిపోతున్న వాతావరణంలో
కుటుంబం,సమాజాల పతనంతో బాల్యం ఆగమాగమవుతున్నది.
ఆశలు,కర్తవ్యాలు సమతూకం
వేసుకోలేక,
భయం,ద్వేషం కరుడుగట్టిన
బంధాల్లో,అనుబంధాల్లో,
లక్ష్యం,సంస్కారం తూర్పు,పడమరలై సాగే క్రమాన,
పాపం బాల్యం అనుభూతులకు
దూరమవుతున్నది.
కామెంట్‌లు