సుప్రభాత కవిత ; -బృంద
సాగరమధనంలో
పుట్టిన అమృతభాండంలా

నిశీధి చీకట్లను వధించి
వెలుగుల వెల్లువలా

అలజడిలో అలసిన
మనసుకు ఆశాకిరణంలా

అగమ్యగోచరంగా ఉన్న
బ్రతుకులో తోచిన గమ్యంలా

భయపెట్టిన తిమిరాలను
తరిమేసే ధైర్యంలా...

కొండంత సమస్యలను
గోటితో పోగొట్టే  ఉపాయంలా

జగాన్ని వెలుతురు మయం 
చేసే ఆకాశ దీపంలా

ఊరించే ఆశలతీరాన్ని
చేరువ చేసే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు