రాజు సభ ముగించబోతుండగా ఓవిదేశీ రాయబారి వచ్చాడు. చక్రవర్తి ఆస్థానంలో ఉండే రాయబారి. ఆతని ఆజ్ఞకు రాజులంతా లోబడి ఉండాల్సిందే!రాజసభలోని వారంతా మర్యాదగా ఆహ్వానించారు. రాజు ఎదురుగా ఉన్న గద్దెపై కూచున్నాడు. ఆపై రాజు ముందు ఓపెద్ద నల్లని సున్నా చుట్టాడు."రాజా!దీని అంతరార్థం ఈసాయంత్రం లోపల చెప్పాలి.ఈరాత్రికే నేను చక్రవర్తి కి విన్నవించాలి" అనటంతో సభికులకు ఏమీతోచలేదు.మంత్రి వెంటనే బైటకి వెళ్లిపోయి తన వేగులవారికి చెప్పి "ఇంకో గంటలో నాకు జవాబు చెప్పాలి"అన్నాడు. చతురుడు అనే వాడు"నేను ఓఅరగంటలో జవాబు దీటుగా చెప్తాను " అని ఇంటికి వెళ్లి తన ఇంట్లో ఉన్న పులిచర్మం పంజాని చిన్న పులి బొమ్మలు రెండు తెచ్చాడు సభలోకి.వాటిని రాయబారి గీసిన నల్ల వృత్తం దగ్గర పెట్టాడు.రాయబారి దాన్ని చూస్తూనే తల ఆడించి రాజు దగ్గర సెలవు తీసుకుని తన రాజధానికి బయలుదేరాడు.వేగులవారు అంటే సామాన్యులు కాదు.అతను ఇలా సభకి వివరించాడు."ప్రభూ! చక్రవర్తి మన రాజ్యంపై దండెత్తి మనల్ని చుట్టుముడతానని ఆనల్లని వృత్తం గీశాడు.నేను అందుకే దాని దగ్గర పులిపంజా పులి బొమ్మలు పెట్టి "మేము దెబ్బ తిన్న బెబ్బులిలా మీఅంతు చూసి చీల్చి చెండాడుతాము" అని దీటుగా జవాబు ఇచ్చాను.అందుకే తోకముడిచి వెంటనే వెళ్లి పోయాడు. "అంతే సభంతా హర్షధ్వానాలతో మారుమోగింది.వేగులవారు అంటే నేటి మన సి.ఐ.డి.లాంటి వారు.అనుక్షణం అప్రమత్తం గా ఉండాలి. నేతలను దేశాన్ని కాపలా కాస్తారు.తెరవెనుక ఉండే దేశభక్తులు🌷
అంతరార్ధం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి