మల్లె ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మల్లె మొక్కను తెచ్చాను 
పెరట్లొ మొక్కను నాటాను 
చిన్నా పాదును తీశాడు 
అన్నా పందిరి వేశాడు
చుట్టూ కంచెను చుట్టాను 
రోజూ నీటిని పోశాను
మల్లె మొక్కా పెరిగింది 
మొక్కకు తీగలు పెరిగినవి 
పందిరి నిండా పాకినవి 
మల్లె తీగకు మొగ్గలు వచ్చె 
మొగ్గలు అన్నీ పువ్వులు పూచె 
అక్కా పూవులు కోసింది
అమ్మా మాలలు అల్లింది
దేవుడి పటముకు వేసింది !!

కామెంట్‌లు