హితోక్తులు(బాలగేయం);--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
పాల కడలి అందము
జోల పాట మధురము
జాలి గుణము గొప్పది
మేలి మనసు మంచిది

వాదనలు మించితే
వేదనకు కారణము
క్రోధమును జయిస్తే
మోదమిక పుష్కలము

శోధన గావించుము
సాధనతో విజయము
బోధన మాధుర్యము
చేధన అనివార్యము

వేళకు తినుట ఒప్పు
వేళాకోళం ముప్పు
తాళము ఉపయోగము
మేళమూ అవసరము


కామెంట్‌లు