సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సహము... సహనము
   *****
సహము ఎందుకు మిత్రమా? సహముతో సాధించేది ఏముంటుంది?  అందరికీ దూరమై, ఏకాకిగా బతకడం తప్ప. సహము ఉన్న వారిని ఎవరు భరిస్తారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే సహము ఎంత చేటు తెస్తుందో తెలుస్తుంది.
ఇంతకూ సహము అంటే ఏమిటో చూద్దాం. సహము అంటే గర్వము, అహంకారము,అహము,గీర,పీచము,అహంభావము, గీర్వాణము,గోము,ప్రల్లదనము, పొగరు,దర్పము, క్రొవ్వు,ఉద్దతి,కండకావరము,దుందుడుకు లాంటి అర్థాలు ఉన్నాయి.
సహమును వీడితే సంతోషం మన వెంటే. సహనమే మనకు శ్రీరామ రక్ష.ఆరాటంతో , హడావుడితో ఏదీ సాధించలేము.సాధనలో ఎంత సహనముంటే అంత మంచి ఫలితం ఉంటుంది.
సహనము అంటే ఏమిటో ఈపాటికి అర్థమై వుంటుంది...ఉపశాంతి,ఓపిక,ఓపు,ఓరుపు,క్షమ,క్షాంతి,తాల్మి,సమర్షము,సైరణ, స్థైర్యము లాంటి అర్థాలు ఉన్నాయి.
ఎల్లప్పుడూ సహమునకు దూరంగా ఉందాం.ఎప్పుడూ  సహనముతో సహవాసం చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు