*పుస్తకపఠనం ;-ఎం. వి. ఉమాదేవి

 ఆట వెలది 
1)
పుస్తకమ్ము మనకు పూర్ణజీవితమిచ్చు 
లోక జ్ఞానమిడుచు నాకమగును 
విశ్వమంత దెలియ వివరమ్ము గానుండు 
మాతృభాష సొగసు మహినిదెల్పు !!
2)
చదువుచున్ననెడల చక్కని యనుభూతి 
పుస్తకములతోడ మస్తకమున 
మంచినేస్తమగును మరియొంటరిగనున్న 
నవరసములొసంగు  నవ్యరీతి !!
కామెంట్‌లు