సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఇచ్చించు... వెచ్చించు
  *****
ఇష్టమైనది ఏదీ చేయాలన్నా కష్టం అనిపించదు అంటారు.
అది వృత్తి అయినా, ఉద్యోగం అయినా,మరే ఇతర పని అయినా.. ఇష్టం కష్టాన్ని మరిపిస్తుంది. ఆ తర్వాత ఆనందాన్ని ఇస్తుంది.
ఇంతకు మనం వేటిని ఇచ్చించాలో చూద్దాం.మనకు నచ్చిన, సమాజం మెచ్చిన పనులను ఇచ్చించాలి. అప్పుడే మనసుకు తృప్తి కలుగుతుంది.
 
ఇచ్చించు అంటే ఏమిటో ఈపాటికి అర్థమై వుంటుంది...ఇష్టపడు,ఇచ్చగించు,ఇష్టించు,ప్రియంపడు,మనసు పెట్టు,మనసించు,మనస్కరించు,వలచు,వలయు లాంటి అర్థాలు ఉన్నాయి.
ఏ హితకరమైన పనైనా కేవలం ఇచ్చుంచుట కాదు. ఆ పని కోసం సమయాన్ని, తెలివితేటలను,డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది.
వెచ్చించు అంటే  ఖర్చు చేయు,ఖర్చు పెట్టు,వ్యయపరుచు,చిందు,వెచ్చపరుచు,వ్యయించు లాంటి అర్థాలు ఉన్నాయి.
ఆశయం ఆచరణ రూపం దాల్చాలంటే  కాలంతో పాటు పైకాన్ని కూడా ఖర్చు చేయవలసి ఉంటుందని గ్రహించాలి.
అంతేకాదు మనం బాగా ఇచ్చించే వారి కోసం, మనల్ని ఇచ్చించే వారి కోసం తప్పకుండా  సమయాన్ని వెచ్చించాలి.అలా వెచ్చించినప్పుడు మానవీయ బంధాలు పెరుగుతాయి. మానసిక తృప్తి, సంతోషం కలుగుతాయి.
మధ్యాహ్న  నమస్సులతో🙏

కామెంట్‌లు