" మే మెవరికీ వద్దా.... ! ";-కోరాడ నరసింహా రావు !
ఆడపిల్లని  పుట్టానని... 
  నాన్నకే కాదు... నానమ్మకూ 
 నేనంటే  ఎంతచిరాకో.... !

తమ్ముడు  వంశోద్దారకుడట 
వాడు మాయింటి వంశాంకుర మని ఇంట్లో అందరికీ వాడంటే ఎంతముద్దో... !!
 వాడు అడగకపోయినా... 
  అన్నీ కొనిపెడుతుంటారు !
  నేను ఆశపడి, ఏది అడిగి నా 
   ఛీ కొడతారు... !!

వాడికంటే పెద్దదాన్ని నన్నింకా ఆ దుంపలబడిలోనే ఉంచారు 
వాడికేమో ఇంగ్లీషు బడిలో... 
బోలెడు డబ్బు ఖర్చుపెడుతు న్నారు.... !

వాడికైతే,ఆదివారమొచ్చిందంటే... పార్కులు, షికార్లు !
నేనేమో...అమ్మకి ఇంటిపనుల్లో
సాయానికని ఉండిపోవాల్సిందే 

ఆడపిల్లలంటే.... ఎక్కడైనా ఇంతేనా.... !?
  బాబులంటేనే ముద్దా... 
   మేమెవరికీ వద్దా.... ?!
*********

కామెంట్‌లు