తిరుగుదామా ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఏరోప్లేను ఎక్కుదామా 
యూరోపు వెళదామా
స్టీమరు ఎక్కుదామా
సీమకెళ్ళి పోదామా
రైలుబండి ఎక్కుదామా 
రామేశ్వరం వెళదామా
మోటరుకారు ఎక్కుదామా
మోపిదేవి వెళదామా
బస్సుపైన ఎక్కుదామా
బరంపురం పోదామా 
పెద్దసైకిలు ఎక్కుదామా 
పెద్దాపురం పోదామా
ఎద్దుబండి ఎక్కుదామా
ఏలేశ్వరం వెళదామా
నడిచి వెళ్ళిపోదామా
సరదాగా తిరుగుదామా !!

కామెంట్‌లు