ఆంగ్ల సాహితీ వేత్తలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఐజాక్ సింగర్ అమెరికన్ యూదు రచయిత. పిల్లలు పెద్ద ల కోసం  ఎన్నో రచనలు చేశాడు.తొలిసారి పోలెండ్ నించి  అమెరికా వెళ్లాడు. ఒక్క ఆంగ్లపదం భాష రాని స్థితి!తన మంచితనం ప్రవర్తనతో నిలదొక్కుకున్నాడు.ఆయన ఆత్మ విశ్వాసం తో ఇలా అన్నాడు " రచయిత అంటే  ఓమొలక! కొన్ని ఎడారిలో కొన్ని నదీ తీరంలో ఇంకొన్ని ఎక్కడ పడ్తే అక్కడ మొలకెత్తి ఎదుగుతాయి. నేను ఎక్కడకెళ్లినా రచయితగానే బతికితీరుతాను.నేను జ్యూ యూదు జాతివాడిని! నాకు రాయటానికి ఏమీ దొరక్కపోతే యూదుల సమస్య పై ఎంచక్కగా రాయగలను.10లక్షల వ్యాసాలు రాసినా సరే నాదగ్గర ఏదో ఒక సమస్య ఎదురుగా వచ్చి నిల్చుని ఏదో ఒకటి రాయమని పురిగొల్పుతుంది."
ఓసారి పబ్లిషర్ దగ్గరికి తన ఓపెద్ద నవలను పట్టు కెళ్ళాడు."సింగర్!దీన్ని1/3వంతుకి కుదించి తీసుకుని రా!"అలాగే అని పబ్లిషర్ చెప్పినట్లే చేశాడు. "ఆపబ్లిషర్ మాటలకీ గంగిరెద్దు లాగా ఎందుకు తలూపావు?" ఛడామడా తిట్టాడు మిత్రుడు. సింగర్  జవాబిది" అంత పెద్దగా సాగదీసి రాయటం నాతప్పు.శుద్ధ దండగ!ఆ చాట భారతం ఎవరూ చదవరు.నేను  నిద్రను గూర్చి  ఎంతైనా రాయగలను.కానీ ఆసుత్తి చదవటంకన్నా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలనే పాఠకుడు కోరుకుంటాడు." ఇదీ సింగర్  అభిప్రాయం!
వాల్టేర్ మహా చిదానంద స్వరూపుడు! ఆయన ఆఖరి ఘడియల్లో ఉన్నప్పుడు చర్చీ ఫాదర్ ప్రార్ధన చేయటానికి వస్తే "ఫాదర్!మీరు ఎక్కడనుంచి వస్తున్నారు?" అడిగాడు. "ప్రభువైన ఏసుదర్బారు నించి!" "ఓహ్! అక్కడి నుంచి వచ్చినట్లుగా మీ సర్టిఫికెట్ చూపుతారా?" అంతే కోపంతో  ఫాదర్ విసవిసా వెళ్లి పోయాడు. అలాంటి వాల్టేర్ మంచి రచయిత  చమత్కారి కూడా!
ఆస్కార్ వైల్డ్ న్యూయార్క్ యాత్ర ముగించుకొని రాగానే ఓవిలేఖరి అడిగాడు " మీయాత్ర బాగా జరిగిందా?".
"ఓ..బ్రహ్మాండంగా! నాఇద్దరు తమ్ముళ్ళు నా సెక్రెటరీలు! ఒకడు నాకు వచ్చిన  లేఖలకి జవాబు రాస్తాడు. రెండోవాడు నన్ను కలవడానికి వచ్చేవారిని  వివరాలు కనుక్కొని పంపుతాడు నాదగ్గరకి! హు! ఏంచెప్పేది? పెద్దవాడు  ఆసుపత్రి పాలైనాడు.రెండోవాడు వచ్చిన  జనం ప్రశ్నలకి జుట్టు పీక్కుని తలని బోడిగా చేసుకున్నాడు. "ఆరోజుల్లో రచయిత అంటే అంత క్రేజ్  మోజు!
హెచ్. జి.వేల్స్ లండన్ లోని తన కొత్త ఇంటిని మిత్రుడికి చూపుతున్నాడు.3వ అంతస్తులోని చిన్న గదిని చూపి "ఇది నాబెడ్ రూమ్" అన్నాడు. "కింద అంతస్తులోని గదులు బ్రహ్మాండంగా విశాలంగా ఉంటే ఈ టిక్కీ గది ఎందుకు నీకు?" మిత్రుడి ప్రశ్నకు  అతనిచ్చిన జవాబిది" గత 20ఏళ్ళు గా నావంట మనిషి  పనిమనిషి నమ్మకంగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు  మాఅమ్మ లండన్ లో  ఓఇంట్లో  పనిమనిషి!"నిజంగా ఆయన జవాబువిని మిత్రుడు  బిత్తరపోయాడు.
టైంమిషన్ లాంటి సైన్స్ విశేషాలతో రాసిన ఆయన రచనలు జనంలో ఉత్సాహం జోష్ నింపాయి.ఓమహిళా జర్నలిస్టు  ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలని ఆయన హోటల్ గదితలుపుని తట్టింది. "ఎవరమ్మా?ఏంకావాలి?" ఆయన ప్రశ్నలకు ఖంగారు భయంతో"నేను...నేను..హెచ్. జి.వేల్స్ ని!" అంది."ఓ..భలే భలే! నాపేరు కూడా హెచ్. జి.వేల్స్! మనిద్దరి పేర్లు ఒక్కటే! లోపలికి రా తల్లీ!" అని ఆమెకు మంచి నీరు ఇచ్చి  బెరుకు పోగొట్టాడు.ఆపై ఆమె కుదుట పడి  బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసింది. 🌹

కామెంట్‌లు