కృతఘ్నత! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకి ఎవరైనా ఉపకారం  మేలు చేస్తే వారిని  మనం జీవితాంతం మర్చిపోకూడదు.కృతఘ్నులం కారాదు.వారు మనల్ని తప్పు దారిలోకి లాగితే కృతజ్ఞత చూపాలి అని వారుచెప్పిన చెడుమార్గంలో నడవరాదు.ఎవరైనా డబ్బు సాయంచేసి దేశద్రోహపనులు హత్య చేయమంటే వారివలనుండి తప్పుకోవాలి.
ఆరైతు దంపతులు కుక్క టామీని ప్రేమగా పెంచుతున్నారు. టామీ ముసలిదైంది తిండి దండగ అని భార్య సణిగేది.పైగా ఓకొడుకు పుట్టడంతో టామీకి పాసిపోయిన జొన్నరొట్టె అన్నం మట్టిలో పడేసేది.టామీ ఆమె బాధపడలేక అలా ఊరుపొలిమేరల్లో తిరగసాగింది.అక్కడ పట్నంకుక్క కనపడితే టామీ తన మొరవినిపించింది"రైతు భార్య సతాయిస్తుంటే ఇలావచ్చేశాను.భార్య నోటికి జడిసి రైతు మౌనంగా ఉండి పోయాడు. " "పిచ్చిదానా!నేడు  పిల్లలు అమ్మా నాన్నలనే వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు.కుక్క నయం అని మనిషి ఆనందించే రోజులు!"అని ఓ ఉపాయం చెప్పింది.టామీ  రైతు  ఇంటి బైట తచ్చాడుతూ ఉండేది. ఆరోజు రైతు భార్య పిల్లాడిని వరండాలో చాపపై పడుకోబెట్టి  అక్కడే ఏదో పని చేసుకుంటోంది. ఇంతలో ఓదొంగ  ఆపసివాడి కాలి కడియాలు లాగటం వాడు కెవ్వు మనటంచూసిన టామీ తీసిన గేటులోంచి వరండాలోకి దూకి  దొంగ కాలు పట్టుకుని  గట్టిగా కొరకసాగింది.ఆహఠాత్ సంఘటన కి దొంగ నేలపై కూలబడటం రైతు భార్య అరుపులతో చుట్టుపక్కల వారు వచ్చి దొంగని పట్టు కోటం జరిగింది. టామీ వాడిపై దాడిచేయకపోతే పిల్లాడు కూడా దక్కేవాడు కాడని అంతా టామీని ప్రశంసించారు. రైతు భార్య కన్నీటితో టామీని  దగ్గరికి తీసుకుంది.🌹
కామెంట్‌లు