నందించు...నిందించు
******
అందమైన పువ్వులను, ఆహ్లాదకరమైన ప్రకృతిని, ఏరోజుకారోజు కొంగ్రొత్తగా కనిపించే ఉషోదయాన్ని, నిండు పున్నమి వెన్నెలంటి పసిపాపల బోసినవ్వులను చూసినప్పుడు నందించకుండా ఉండలేము.
అనుకున్నది సాధించినప్పుడు, జరిగినప్పుడు, కోరుకున్నది దొరికినప్పుడు ఎవరైనా సరే నందించకుండా ఉండలేరు.
మరి నందించు అంటే ఏమిటో చూద్దాం. నందించు అంటే సంతోషించు,ఆనందించు,ఆహ్లాదించు,మోదించు,ప్రమోదించు,ఉల్లాసించు సంతసించు,అలరారు,హర్షించు,ప్రమదించు లాంటి అర్థాలు ఉన్నాయి.
కొందరు తమకు కలిగిన కష్టానికి, జరిగిన నష్టానికి ఇతరులను కారకులుగా చేసి నిందిస్తూ ఉంటారు. తమ తప్పిదాలను ఇతరులపై రుద్దడం,ఆక్షేపించడం,ఏ చిన్న పొరపాటు అయినా దాన్ని భూతద్దంలో చూపించి మరీ ఎత్తిపొడుస్తూ, మానసికంగా కృంగి పోయేలా చేస్తారు.
కొందరేమో తాము చేయని తప్పుకు, పొరపాటుకు ఆత్మ న్యూనతా భావంతో కుమిలి పోతూ తమను తామే నిందించు కుంటారు.
అలా ఇతరులను కానీ, తమను తాము కానీ నిందించుకోవడం అనేది చాలా తప్పనేది గ్రహించాలి.
అలా నిందించు పదానికి ఏయే అర్థాలున్నాయో చూద్దాం....ఆక్షేపించు,అధిక్షేపించు,ఎత్తిపొడుచు,తిట్టు,దూఱు,దెప్పు,నుగ్గించు, వంకలు దిద్దు లాంటి అర్థాలు ఉన్నాయి.
ఎవరినీ అనవసరంగా నిందించ కూడదు.
ఈ చిన్న జీవితాన్ని వరంగా భావిస్తూ ఎల్లప్పుడూ నందించుతూ,నందనవనమై సంతోషాలను పంచుతూ ఉండాలి.
మధ్యాహ్న నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి