అనాథ పుస్తకాలు;- ప్రతాప్ కౌటిళ్యా
కవులారా!
రచయితలారా!!
పాఠకులారా!!
పుస్తక ప్రియులారా!!

మీరు చదివిన పాత పుస్తకాలు
చదువుతున్న కొత్త పుస్తకాలు
మీరు పొందిన బహుమతి పుస్తకాలు
మీకు బహుకరించబడిన పుస్తకాలు

దయచేసి

చిత్తు కాగితాల వానికి
ఫుట్ పాత్ పుస్తకాల వానికి
అమ్మకండి!!?

వెల కట్టలేని విలువైన పుస్తకాలను
విలువ లేకుండా చేయకండి!!?
మీ ఇంట్లో వాటికి చోటు లేకుంటే
మీరు చదువ లేకుంటే

దయచేసి

ఆ పుస్తకాలను
పాఠశాలల
కళాశాలల
గ్రంథాలయాలకు చేర్చండి!!!

లేదా
స్థానిక గ్రంథాలయాలకు చేర్చండి!!?

ఆ పుస్తకాలు
పదిమందికి ఉపయోగపడతాయి
పదిమంది కవులు రచయితలు
పదిమందికి పరిచయమవుతారు!!?

ఇప్పుడు
అనాథ పుస్తకాలకు 
గ్రంథాలయాలు !!
అనాథ శరణాలయాలవ్వాలీ !!?

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా
Pratap koutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు