బాల గేయం ; సత్యవాణి కె
చదరంటే చిన్నది
చాపంటే పెద్దది

చిట్టిపాప వ్రేలును
చీకునువద్దన్నను

చుట్టు గుడిశ అందము
చూరు చింప నేరము

చెట్లు పెంచ మంచిది
చేను పంటనిచ్చును
చైత్ర ఋతువు మంచిది

చొరకు పరుల మాటలొ
చోర వృత్తి నేరము
చౌడు నేలహీనము

చందమామ అందము

            

కామెంట్‌లు