తస్మాత్ జాగ్రత్త!అచ్యుతుని రాజ్యశ్రీ

 చింటూకి జలుబుగా ఉంది. కె.జి.క్లాస్ లో ఉన్న వాడికి ఇవాళ ఓరల్ టెస్ట్.ఆపైన చిత్రాలు చూసి అక్షరాలు రాయటం తెలుగు గుణింతాలు రాయాలి.అమ్మ వాడిని రెండు రోజులు గా నిద్రలేచింది మొదలు బడిటైం అయ్యేదాకా రుబ్బుతుంది.నోటి తో అనిపిస్తూ పెన్సిల్ తో రాయిస్తూకూచో పెడుతోంది. "మమ్మీ! రేపు రాస్తా"అని రాత్రి  9కి నిద్రలోకి  జారాడు.అన్నం సరిగా తినలేదు. తెల్లారి 5కే లేపితే"చలి!కాసేపు పడుకుంటా" అంటున్న వాడికి చల్లని నీటితో మొహం కడిగి వేడిపాలు బలవంతంగా తాగించింది. భర్తకు పురమాయించింది"వాడికి డిక్టేషన్ ఇవ్వండి." బడి టైంకావటంతో చింటూకి సాక్స్ తొడిగి షూస్ వేసింది."అమ్మా!కాలుకి ఏదో గుచ్చుకుంటోంది"అని వాడు లబలబలాడుతున్నా" బడికి డుమ్మా కొట్టాలని వేషాలు వేస్తున్నావు" అని షూతాళ్లు బిగించింది.బడిలో ఏడుస్తూన్న చింటూని ఆయా బరబరా లాక్కెళ్ళి క్లాస్ టీచర్ కి అప్పచెప్పింది. "టీచర్!లెగ్!కాలు.." వలవలా ఏడుస్తున్నాడు. వాడి షూస్ విప్పింది.కుడి షూస్ లోఓ బొద్దింక! వాడికాలు ఎర్రగా కందిపోయింది.హెచ్ .ఎం వచ్చి చూసి వెంటనే చింటూ తల్లి ని పిలిపించింది."అమ్మా!పిల్లాడు ఏడుస్తున్నా పట్టించు కోకుండా షూస్ సాక్స్ శుభ్రం గా దులపకుండా మీరు చేసిన  పని క్షమార్హంకాదు.కొన్ని ఏళ్ల క్రితం ఢిల్లీలో ఓతల్లి బూటులో తేలుపిల్ల దూరితే దులపకుండా షూస్ వేసి పంపింది. ఆతేలు కుట్టి  రిక్షా లోనే ఆపిల్లాడు స్పృహ తప్పితే ఇంటికి తెచ్చాడు రిక్షా వాడు. అంతే బాబు ప్రాణాలు గాల్లో కలిశాయి. పిల్లల చదువు మార్కుల కన్నా  ఆరోగ్యం ముఖ్యం!" అనటంతో చింటూతల్లి సిగ్గుతో తలవాల్చింది.ఆమర్నాడు పేరెంట్స్ మీటింగ్ పెట్టి హెచ్. ఎం. చెప్పిన విషయాలు  అర్ధం చేసుకున్నారు అంతా🌷
కామెంట్‌లు