కందం:
*పెద్దలు వద్దని చెప్పిన*
*పద్దుల బోవంగరాదు పరకాంతల నే*
*పొద్దే నెదఁబరికించుటకు*
*పదేశములు ఁగూడ దుర్విఁ గుమారా !*
తా:
కుమారా! పెద్దవారు చేయకూడదు, వద్దు అని చెప్పిన ఏ పనిని నీవు చేయ కూడదు. ఈ భూమి మీద, పరాయి స్త్రీల గురించి ఎప్పుడూ మనసులో ఆలోచన కూడా రానీయ వద్దు. అలా అలోచనలు చేయడం గురించి ఉపదేశాలు చేయవద్దు.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పెద్దవారి మాటలు ఎప్పుడూ సద్ది మూటలే! ఏమాత్రమూ అనుమానము లేదు. ఇక్కడ మనకు రావణ బ్రహ్మ, ధృతరాష్ట్రుడి పెద్ద కుమారుడు దుర్యోధనుడు కంటే వేరే ఉదాహరణలు అక్కర లేదు. అందుకే రామాయణ, మహాభారతాలు పుక్కిటి పురాణాలు కాదు. అవి మన జీవిత గమనానికి నిత్య చుక్కానులు. కారణాలు వేరైనా, జరిగిన అనర్ధం ఒకటే. సీతమ్మను చెర బట్టి రావణ బ్రహ్మ, రావణాసురుడు అయి రాజ్యాన్ని బంధుజనాన్ని, చివరికి తనని తానే కోల్పోయాడు. దుర్యోధనుడు కూడా ద్రుపద రాజకుమారిని కోరుకున్నాడు, వంశ క్షయం జరిగి రాజ్యం కోల్పోయి, తానూ మరణించాడు. మనం వీరి లాగా కాకూడదు అంటే, పెద్దల మాటని మదిలో నిరంతరం జ్ఞాపకం ఉంచుకుని, మనది కానీ దేనికోసమూ అర్రులు చాచకుండా ఉండాలని, అలా ఉండేలా పరమేశ్వరుడు మనలను అనుగ్రహించాలని, అలా మనలను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ.... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి