*"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుని మాహాత్మ్యమును బ్రహ్మణునకు పార్వతి చెప్పడం - శంభుడు ప్రత్యక్షమై పార్వతిని తనవెంట రమ్మనడం*
*నారదా! అనంతంగా ఆపకుండా ఏక ధాటిన శివనింద చేస్తున్న బ్రాహ్మణుని చూచి పార్వతి, "అయ్యా! మీరు జ్ఞానులు, పరమ పూజ్యలు అని అనుకొని మిమ్మల్ని చేరదీసి, మీ పూజ చేసాను. కానీ, మీరు ఏమాత్రమూ ఆలోచన చేయకుండా శివ నింద చేస్తున్నారు. శివ నింద చేసిన వారు ఎంతటి వారైనా మృత్యు దండనకు అర్హులే. కానీ, మీరు బ్రహ్మణులు కనుక మిమ్మల్ని చంప రాదు. కానీ, వెంటనే మీ సాంగత్యము, స్నేహము విడిచి పెట్టాలి. అలా విడిచి పెట్టక పోతే, శివ నింద చేసిన మీతో ఉన్న వారికి కూడా శివ నిందా పాపము చుట్టుకుంటుంది. విపృడా! మీరు నాకు తెలిసిన విషయాలే చెప్పారు కానీ, కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు. మీకు శివుని గురించి తెలుసు అని చెప్పారు కానీ, మీ ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు."*
*" బ్రాహ్మణుడా! రుద్రుడు నిర్గుణ నిరంజనుడు అని నాకు తెలుసు. అటువంటప్పుడు, ఆయనకు రూపం ఎలా ఉంటుంది. రూపమే లేనివానికి అందమేమిటి. సదాశివుడు, తాను కోరుకున్న రూపాన్ని తాను అనుకున్నప్పుడు ధరించగల ఇచ్ఛామూర్తి కదా! శంభుడు పరబ్రహ్మ స్వరూపము. మీరు ఎవరోగానీ, బ్రాహ్మణ వేషంలో వచ్చి, అసంబద్ధమైన, అనుచితమైన మాటలు మాట్లాడుతూ నన్ను మోసగించడానికి వచ్చినట్టుగా ఉంది. నా శంకరుని స్వరూపమును చక్కగా ఎరుగుదును. నాకు అర్ధమైన శివ తత్వమును వివరిస్తాను, వినండి."*
*"పరమేశ్వరుడు నిర్గుణ నిరాకారుడు. అన్ని గుణములు ఆయనవే. మరి ఆయనకు జాతి, కులము ఎక్కడ ఉంటాయి. ఆతడు సంపూర్ణ పరమాత్మ. ఆతడే అంతటికీ ఆద్యుడు. అన్ని విద్యలు, వస్తువులు ఆయనలోనే ఉన్నప్పుడు ఆయనకు ఏ చదువుతో ఏమి పని? సృష్టి మొదట తన శ్వాస నుండి వెలువడిన వేదాలను విష్ణుమూర్తి కి ఇచ్చిన వారు. ఆయనకు సమానమైన, దైవం, ప్రభువు ఇంక ఎవరు ఉంటారు. ఈ చరాచర జగత్తు కు కారణమైన వానికి వయస్సు ఎవరు నిర్ణయించగలరు. ఆ సర్వేశ్వరుని ఎల్లప్పుడూ భజన చేసే వారికి, ప్రభు శక్తి, ఉత్సాహ శక్తి, మంత్ర శక్తిని ఆయనే ఇస్తారు. సదా శివుని భజించే వానికి మృత్యువు భయము లేకుండా చేస్తారు కనుకనే, "మృత్యుంజయుడు" అయ్యాడు నా స్వామి. అష్ట సిద్ధులు, శంకరుని ముందు తల వంచి నిలబడి ఆయన కోరిక మేరకు నడచుకుంటాయి. అటువంటి, స్వామికి కోరికలు ఏమి ఉంటాయి. ఎప్పుడూ నిర్వికారంగా ఉండే శంభునికి, వికారములు ఎలా కలుగుతాయి. "శివ" నామాన్ని పలికిన వారిని చూస్తేనే అన్ని శుభాలు ఇచ్చే సర్వమంగళుడు, శంకరుడు. ఆతను రాసుకున్న శ్మశానం లోని బూడిద అయినా, పవిత్రమైన విబూది గా మారుతుంది. మరి ఆ శుభంకరునికి మలినము ఎక్కడిది. మహాదేవుడు సగుణ రూపములో అన్ని లోకములకు కర్త, భర్త, హర్త అవుతారు."*
*"ఇంతటి మహాదేవుని, మానవులు తమ బుద్ధి ద్వారా తెలుసుకునే అవకాశం ఏ మాత్రం లేదు. నీ వంటి దురాచారులు, పాపులు, దేవతలచేత వదలి వేయబడ్డ వారూ ఎప్పటికీ తెలుసుకోలేరు. శివ తత్వము తెలుసుకోలేక, శివదూషణ చేసారు, మీరు. మీరు ఇప్పటి దాకా సంపాదించుకున్న పుణ్యం అంతా ఆవిరి అయిపోయింది కదా, విప్రోత్తమా! శివద్రోహిని చూచిన వారు, వస్త్రాలతో సహా ఆభ్యంగన స్నానం చేయాలి. ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి."*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి