తిరుప్పావై పాశురం(ఆజిమజై)-04;-డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట, కరీంనగర్--9963991125
ఆళిమళై క్కణ్ణా ఒన్రు నీ కైకరవేల్
ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడు ఆర్తేరి
ఊళి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్కరుత్తు
పాళి పాళియందోళుడై పర్భనాబన్ కైయిల్

ఆళి పోళ్ మిన్ని వలంపురి పోల్ నిన్రు అదిర్ న్దు
తాళాదే శర్గం ఉదైత్త శరమళై పోల్
వాళ ఉలగినిల్ పెయ్ దిడాయ్
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళిందు ఏలో రెంబావాయ్

తిరుప్పావై-ఇష్టపది-4

వరుణదేవా! నీవు కరుణ గై దాచకుము
శరధి జలముల త్రావి అరచి నభమునకెగిరి
జగదాది వర్ణమును మొగిలు రూపముదాల్చి
బల చతుర్భుజుడైన పద్మనాభుని చేతి

చక్రంబు వలె మెరసి,శంఖంబులా ఉరిమి
శార్ఙ్గమందున గురియు శరపరంపరబోలు
చినుకులను కురిపించు చిద్విలాసముతోడ
జనులెల్ల హర్షించు తనువుల్లు పులకించి

మార్గళిన నీరాడి మది సంతసించెదము!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!

కై = చేయి;శరధి =సముద్రము
నభము =ఆకాశము;జగదాది = జగతికి మూలకారకుడు
మొగిలు = మేఘము;శార్ఙ్గము = శ్రీమహావిష్ణువు ధనుస్సు
మార్గళి = మార్గశీర్షమాసము;నీరాడి = స్నానమాచరించి

తిరుప్పావై పాశురం(మాయనై)-5

మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ ద దామోదరనై

తూయోమాయ్ వన్దునాంతూమలర్ తూవిత్తొழுదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిழைయుమ్ పుగుదరువాన్ నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పు ఏలో రెంబావాయ్!

తిరుప్పావై -ఇష్టపది-5

మాయావి,యుత్తరపు మధురాధినాయకుడు,
అతిపునీతాంబువుల యమునాతటీవనపు
యదువంశమున కాంతి వెదజల్లు మణిదివ్వె,
తల్లిగర్భము దీపమల్లె చేసినవాడు,

దామోదరుడు, మనము తానమాడియు నతని
నోరార కీర్తించి,మనసార ధ్యానించి
విరుల మాలికలల్లి ప్రేమతో నర్చించ
పూర్వంపు, రాబోవు పుట్టుకల పాపములు

దూది గాల్చిన నిప్పు దూమమై నశియించు
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!



కామెంట్‌లు