పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లా అఱక్కనై
కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి ఎழுన్దు వియాழమ్ ఉఱఙ్గిற்று
పుళ్ళుమ్ శిలుంబిన గాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడత్తియో? పావాయ్ నీ నన్నాళాల్
కళ్ళన్ తవిర్ న్దు కలన్దు ఏలో రెంబావాయ్
ఇష్టపది పాశురం-13
కొక్కి ముక్కును చీల్చి గొల్ల గాచినవాని,
దశకంఠముల గిల్లి దనుజు జంపినవాని,
కీర్తిగానము చేస్తు ఆర్తితో చెలులంత
నోచు స్థలమును చేరి వేచియున్నారమ్మ!
శుక్రుడెక్కెను నింగి,శుష్కించి గురు గ్రుంకె
పక్షులన్నియు లేచె పలకరింపులు అవిగొ!
తమ్మి వాలిన గండు తుమ్మెదల కళదాన!
చన్నీట నీరాడ, సంది దిగి రావమ్మ!
మంచిదినమున కల్ల మాని,మము చేరవే!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!
==============================
కొక్కి = కొంగ,తమ్మి =పద్మము
కళదాన=కన్నులదానా!,సంది = మంచము
కల్ల = కపటత్వము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి