తిరుప్పావై పాశురం-14;-డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట,కరీంనగర్9963991125
ఉఙ్గళ్ పుழைక్కడై త్తోటత్తు వావియుళ్
శెఙ్గழுనీర్ వాయ్ నెగిழ்న్దు ఆమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
శెఙ్గల్ పొడిక్కూఱై వెణ్ పల్ తవత్తవర్
తఙ్గళ్ తిరుక్కోయిల్ శఙ్గిడువాన్ పోతన్దార్

ఎఙ్గళై మున్నమ్ ఎழுప్పువాన్ వాయ్ పేశుమ్
నఙ్గాయ్ ఎழுన్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్
శఙ్గొడు శక్కరమ్ ఏన్దుమ్ తడక్కైయన్
పఙ్గయక్కణ్ణానై ప్పాడు ఏలోరెంబావాయ్!

తిరుప్పావై ఇష్టపది-14

మీ ఇంటి పెరటిలో మెట్లబావిన నీట
నెరుపు తమ్ములు విరిసె,నీలి కల్వలు ముడిచె
చెంగావి ధారులై చెమకులీనెడు దంత
కాంతులను వెదజల్తు కదిలారు జీయర్లు

కోవెలలు తెరుచుటకు కుంచెకోలల దాల్చి;
ముందుగా మమ్మల్ని ముదముతో మేల్కొల్ప
మాట యిచ్చియు నీవు యింటనే యున్నావు 
లలితాంగి! పరిపూర్ణ! లజ్జ యుడిగినదాన!

వాచాటి! లేచిరా! వలమురి,యరి దాల్పు,
బాహుబల సంయుతుడు! పంకజాక్షుడు,హరిని
కీర్తించ మనసార! కీరవాణీ! రావె!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!

మెట్ల బావి= దిగుడుబావి,తమ్ములు = తామరపూలు
చెంగావిధారులు= కాషాయాంబరధారులు
కుంచెకోల= గుడి తలుపు తెరియునపుడుపయోగించు కర్ర
లజ్జ = సిగ్గు,వాచాటి= మాటకారి
వలమురి =శంఖము,అరి =చక్రము,దాల్పు =ధరించినవాడు



కామెంట్‌లు