ప్రతి కుటుంబంలో ఉన్న వ్యష్టి వ్యవస్థ, వ్యక్తి వ్యవస్థగా మారడాన్ని సంసారబంధము అంటారు ఏక వచనం ద్వి వచనంగా మారడం అంటే విడివిడిగా ఉన్న రెండు స్త్రీ, పురుష లింగాలు కలిసి ఒకటిగా ఓకే మనసుతో ఒకే ఆశయంతో ఓకే ఆదర్శంగా జీవిస్తున్న వ్యక్తి గొప్ప వ్యక్తిత్వమని సంప్రదాయ బద్ధమైన కుటుంబమని నలుగురులోను పేరుపొందుతారు అంతమాత్రం చేత భార్యాభర్తలిద్దరికీ ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండవా? సామాన్యంగా ఏ స్త్రీ యైనా తన మనసులో కోరికలను భర్తతో గాని అత్తమామలతో కానీ చెప్పడానికి ఇష్టపడదు చెప్పడం వలన ఆ కోరిక తీరుతుంది కానీ చెపితే తాను చులకన అయిపోతానని మొహమాటపడి చెప్పడానికి జంకుతుంది అది స్త్రీ సహజ గుణం. గృహిణికి అప్పుడప్పుడు తన పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో కాలక్షేపం చేసి ఆనాటి విషయాలన్నిటిని ఏకరవు పెట్టాలని అభిప్రాయం కోరిక లేకుండా ఉంటుందా గ్రామంలో తెలిసిన వారి బంధువుల ఇళ్లకు వెళ్లి వారితో కాలక్షేపం చేయాలని ఏ స్త్రీ కోరుకోకుండా ఉంటుంది. కానీ బయటకు మాత్రం చెప్పదు కొంతకాలమయిన తర్వాత సంతానం వచ్చి వారు రెండు మూడు తరగతులు చదువుతూ ఉన్న సమయంలో నాన్నా అమ్మమ్మను చూస్తామని, తాతయ్యని చూస్తామని పిల్లలతో వాళ్ళ నాన్నను అడిగిస్తుంది తప్ప తన కోరికగా చెప్పుకోదు పిల్లలు అడిగితే తప్పుతుందా సెలవులు రాగానే ముగ్గురిని అక్కడికి పంపిస్తారు అక్కడ పిల్లలకు ఆడింది ఆటగా పాడింది పాటగా అంతా కొత్త వాతావరణం వాళ్లను చూడ్డానికి వచ్చే బంధు వర్గం వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే ఎంతో మురిసిపోతూ ఉంటారు. రాకరాక వచ్చిన మనవడ్ని, మనవరాల్ని చూసుకుంటూ వారిని కాలు కింద పెట్టకుండా ఎంతో గారాంగా వాళ్ళ అమ్మానాన్న చూసిన దానికన్నా ఎక్కువ ఆప్యాయంగా చూస్తూ వారికి నా నా రకాల గ్రామాల వంటలను రుచి చూపిస్తూ ఆనందింప చేస్తారు నగరాలలో ఉలవచారు తెలియదు ఆ ఉలవచారులో టమోటాలు వేసి తిరగమోత వేసిన తర్వాత మీగడతో కలుపుకొని తింటూ ఉంటే దాని మజా వేరుగా ఉంటుంది కదా పచ్చి పులుసు వారు ఎప్పుడూ రుచి చూచి ఉండరు పెరుగులో వంకాయ లాంటి పదార్థాలను వేరు వేరుగా తినడం వారికి తెలియదు. ఉప్పు కారం కలిపి తిరగమోత వేస్తే దాని రుచి పిల్లలు ఎప్పుడూ తిని ఎరుగరు. ఆ రుచులన్నీటిని చూసిన తరువాత ఎప్పుడు అమ్మమ్మ దగ్గరకు రావాలా అని ఆలోచిస్తూ సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.
పాపం పడతి (16);-డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి