ఏ సంసారంలోనైనా గృహిణి తాను తన ధర్మాన్ని నిర్వహిస్తూ అందరి ప్రేమకు పాత్రురాలై అందరిని ఒక తాటి మీద నడిపించే స్థితి వచ్చిన తరువాత అప్పుడప్పుడు పిల్లల మానసకస్థితి వికసించడం కోసం చిన్న చిన్న దేవాలయాలకు గ్రంథాలయాలకు ఆ పరిసర ప్రాంతాలలో చూడదగిన విశేషాలు ఉన్న ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడి విషయాలను అన్నిటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం ఆమె కర్తవ్యం గా భావిస్తుంది పిల్లలు నూతిలో ఉన్న కప్పల్లాగా జీవించడం ఆమెకు ఇష్టం ఉండదు లోకజ్ఞానం తెలియాలి నలుగురితో తిరుగుతూ నలుగురి మనస్తత్వం తెలుసుకొని ఎదుటివారిలో ఉన్న మంచి చెడులను గుర్తించే స్థితి వారంతట వారికి వచ్చేలా ప్రయత్నించేసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది గృహిణి
ముందు ఆ గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇళ్లకు ఒక్కొక్క పర్యాయం ఒకఇంటికి వెళ్లి వారితో కాలక్షేపం చేసి పిల్లలతో చక్కగా మాట్లాడుకుంటూ తన పిల్లలను వారికి పరిచయం చేస్తూ సన్నిహిత సంబంధాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అలా చేయడం వల్ల తన బంధువులు ఎవరో స్నేహితులు ఎవరో పిల్లలకు అర్థం అవుతుంది వారితో ఎలా ప్రవర్తించాలి వారు తమ ఇంటికి వచ్చినప్పుడు వారిని ఎలా చూడాలి అన్న విషయం వారంతట వారు తెలుసుకునేలా చేస్తుంది అమ్మ పిల్లల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో తల్లికి తెలుసు. కనుక వారి మనసుకు ఏ విధమైన కష్టమూ కలుగనీయకుండా భోజన పానాదులతో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ అపార్ధాలు కలిగేలా ప్రవర్తించడం చేయకపోవడం ఆమెకు అలవడిన సహజగుణం. వారాంతపు సెలవలలో దగ్గరలో ఉన్న పార్కుకి పిల్లలతో పాటు భర్తను కూడా తీసుకొని వెళ్లి అక్కడ పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తూ చిన్న చిన్న ఆటలు దాగుడుమూతలు లాంటివి చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది పిల్లలకు మరో ప్రయోజనం కొన్ని ఇతర కుటుంబాల నుంచి కూడా వచ్చిన పిల్లలు ఉంటారు కదా వారితో కూడా కలగలిసి మాట్లాడడం ఆడడం చేస్తూ ఉంటే వారు చక్కటి స్నేహితుల్లాగా తయారవుతారు. ఆ వయసులో కుదిరిన బంధం స్నేహం జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది వారు నిష్కల్మషంగా అసలు ఏదీ దాచుకోకుండా మనసులోది బయటపెడతారు అలాంటి సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి ఎలాంటి స్థలాలు చాలా అనుకూలంగా ఉంటాయి అన్నది ఎంపిక దానికి దోహదపడవలసినది తల్లిదండ్రులే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి