కాకాని వెంకటరత్నం గారి కి భాస్కర్ నేను గన్నవరం రత్న బోస్ మాజీ శాసనసభ్యులు అంటే బాగా ఇష్టం. వారు చేయదలుచుకున్న పనిని మాతో ఇలా చేయమని ఒక తండ్రిలా చెప్పేవాడు. భారత్ సేవక్ సమాజ్ పేరుతో మొట్టమొదట చేసిన కార్యక్రమం మా గ్రామంకృష్ణా జిల్లా తేలప్రోలులో మూడు రోజులు ఉదయం ప్రజలతో మమేకమై అక్కడ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు ఏమిటి అని చూడడం భోజనాలు అయిన తర్వాత తేలప్రోలు ఉన్నత పాఠశాల ఆవరణలో సమావేశాలు గ్రామంలో ఎవరు రావాలనుకున్నా రావచ్చు వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు దీనితో జరిగిన మంచి ఏమిటంటే కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకపోవడం అంతా ఒక కుటుంబం లాగా కలిసి మాట్లాడుకోవడం. ఆ రోజుల్లోనే భాస్కర్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం మాతృమూర్తిని, మాతృదేశాన్ని ప్రత్యేకించి తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోయే మనిషి కాదు అని ఆలోచించి అన్ని కార్యక్రమాలు చేయడానికి నడుం బిగించి మొదటి ప్రాధాన్యత తన గ్రామానికి ఇవ్వడం ఇందుకు తార్కాణం.
కాకాని వెంకటరత్నం గారు గొప్ప రాజనీతిజ్ఞుడు తాను చేయదలచుకున్న పని తాను ఆలోచించి చేసినట్లుగా కాక యువతకు ఆ బాధ్యత అప్పగించి మీరు ఏది చెబితే అది చేస్తాను నాకు ఏమీ తోచడం లేదు అనేవారు. ముందు అడిగేది భాస్కర్ నే నీ అభిప్రాయం చెప్పు చేర్పులు, మార్పులు మిగిలిన వారు చెబుతారు అంటారు. నాకు రత్న బోస్ కు చాలా బాగా నచ్చింది భాస్కర్ చెప్పింది మనం చిన్న చిన్న విహార యాత్రలు చేస్తూ ఉంటాం ఆర్థికంగా స్తోమత లేని వారు ఏం చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ ఆ అవకాశం రాదు ఆ అవకాశం మనం కల్పిస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని గురించి చర్చించి నప్పుడు మధ్యలో బోసు ఎంతమందిని తీసుకువెడదామని అభిప్రాయం అంటే దాదాపు 75 మందిని అనేసరికి చాలా బాధ్యతగా తీసుకెళ్లవచ్చు వీరిలో ఏ ఒక్కరు తప్పిపోయినా మాట పడవలసి వస్తుంది అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటే కాకాని గారు మీరు ముగ్గురు ఉన్నారు కదా ప్రక్కన కొంత మంది మీకు సహాయంగా కూడా ఉంటారు వీరంతా ఏం చేస్తారు అందరూ చూస్తూ ఉంటారు కదా తప్పిపోయే అవకాశం ఉంటుందా అని చెప్పి నేను కూడా మీతోనే ఉంటాను కదా ఏది కావాలన్నా అప్పటికప్పుడు మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి వుంటుంది అని చెప్పిన తర్వాత కార్యక్రమం ఎలా చేయాలి, ఎవరిని తీసుకువెళ్లాలి దానికోసం వయస్సును నిర్ణయించి ఆ వయసు దాటిన వారిని మినహాయించి ఆర్దికంగా స్తోమత లేని వారిని మాత్రమే ఎంపిక చేయడం అని నిర్ణయం తీసుకున్నాం. మొదట ఈ పిల్లలను విశాఖపట్నం తీసుకెళ్లాలని నిర్ణయించి అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అన్ని రోజులకు సరిపడా సదుపాయాలను ఏర్పాటు చేసుకొని వంట మనిషిని అతని సహాయకులను వెంటబెట్టుకుని కాకాని వెంకటరత్నం గారు ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలు బోగీలను నేను రత్న బోస్, భాస్కర్ లతో విశాఖపట్నంలో కాలు పెట్టి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని తెల్లవారి విశాఖపట్నం లో చూడవలసిన ప్రదేశాలు అన్నీ పిల్లలకు చూపించి వారికి వచ్చే అనుమానాలను తీర్చుకుంటూ ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అన్న భయంతో చాలా జాగ్రత్తగా కార్యక్రమాలను నడుపుకుంటూ వెళ్ళాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి అంశంలోనూ మా భాస్కర్ హస్తం ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి