తిరుప్పావై – 4వ పాశురము; సి. మురళీమోహన్
 శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో
4వ పాశురము:-
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడార్ త్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై ప్పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని వలమ్బురి పోల్ నిన్రదిర్న్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
గంభీరస్వభావుడా! వర్షనిర్వాహకుడా! ఓ పర్జన్యదేవా! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపజేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి, ఆ సముద్రజలమునంతను, నీవు పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి, సర్వజగత్కారణభూతుడగు శ్రీ నారాయణుని దివ్యవిగ్రహము వలె శ్యామలమూర్తివై, ఆ పద్మనాభుని విశాలసుందరబాహుయుగళిలో దక్షిణబాహువునందలి చక్రము వలెమెరిసి, ఎ…
: 🌹  తిరుపావై ~ పాశురము ~ 4/30🌹
(నరసింహ గోష్టి నుండీ)
(శ్రీమతే రామానుజాయనమః)
 (సేకరణ: పి. యల్. నరసింహాచార్యదాసన్ &
(Edited by ఫణిహారమ్ రంగనాథ్)(revised version)
(18/19.12.22)
(19 వ తేదీనాడు అనుసంధానించాల్సిన పాశురమిది)
ఆழிమழை క్కణ్ణా ఒన్ఱు నీ కైకరవేల్
ఆழிయుళ్ పుక్కు ముగన్దు కొడు ఆర్తేరి(కొడార్తేరి)
ఊழி ముదల్వన్ ఉరువంబోల్ (ముదల్వనురువంబోల్) మెయ్   కరుత్తు
పాழிయమ్ తోళుడై (పాళియందోళుడై) పర్భనాబన్ కైయిల్
ఆழி పోళ్ మిన్ని వలంపురి పోల్ నిన్ఱు అదిర్ న్దు(నిన్ఱదిరున్దు)
తాழாదే శార్ఙ్గమ్ ఉదైత్త (శార్ఙ్గముదైత్త) శరమழை పోల్
వాழ ఉలగినిల్ పెయ్ దిడాయ్
నాంగళుమ్ మార్గழி నీరాడ మగిழ்న్దు ఏలో రెంబావాయ్
 
 
ప్రతి పదార్థాలు:
 
ఆழி మழை కణ్ణా ~ వర్షాధి దేవత అగు పర్జన్యుడా నీవు;
వొన్ఱు నీ కై కరవేల్ ~ చేయి దాచుకొనకుము;
ఆழிయుళ్ పుక్కు ~ సముద్రమున చొచ్చి;
ముగన్దు కొడు ఆర్తేరి~ నీరు త్రాగి గర్జించి పైకి ఎక్కి;
ఊழி ముదల్ వన్ ~ లోకములకు ఆది దేవుడైన విష్ణువు యొక్క;
ఉరువమ్ పోల్~ ఆకారమువలె;
మెయ్ కరుత్తు~ నీ శరీరము (మబ్బు) బాగుగా నలుపెక్కునట్లుగా చేసుకొని;
పాழிయన్దోళుడై ~ పొడవైన అందమైన బాహువులు కలిగిన;
పఱ్పనాబన్ కైయిల్ ~ పద్మనాభుని చేతిలోని;  
ఆழிపోల్ మిన్ని ~ చక్రము వలె మెరసి;
వలమ్బురి పోల్ ~ దక్షిణావర్త శంఖము వలె;
నిన్ఱదిర్ న్దు ~ స్థిరముగా గర్జించి;
తాழாదే శార్ఙ్గమ్ ఉదైత్త ~ శారంగమున ప్రయోగించిన తాళజాలని;
శరమழை పోల్ ~ బాణ వర్షము వలె;
వాழఉలగినిల్ పెయ్ దిడాయ్ ~ లోకము హర్షించునట్లు కురియుము;
నాఙ్గళుమ్ మార్గழி నీరాడ ~ మేము మార్గశిరమున స్నానము చేయ;
మగిழ் న్దు ఏలో రెంబావాయ్ ~ సంతోషించెదము.
 
 
 భావము:
 
    అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించినవానివద్ద దేవతలందరూ ఆజ్ఞా వశవర్తులై ఉందురు‌.  ఈ గోపికలు ఉత్తముని పేరును పాడి వ్రతమునకు   ఉపక్రమించిరి. వెంటనే వారి కోరిక ననుసరించి వర్షాధి దేవతయగు పర్జన్యుడు పాడిపంటలు బాగుగా వృద్ది చెందుటకు తగిన రీతిగా వర్షించుటకు వారియెదుట సాక్షాత్కరించెను. ఇపుడు గోపికలు ~ పర్జన్యదేవా! నీవు ఔదార్యములో సంకోచమును ఏ మాత్రము చూపకుము. గంభీర సముద్ర మధ్యమునకేగి ఏ మాత్రమూ మధ్యమునకేగి ఆ సముద్రజలమునంతను త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి,  సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయయణుని దివ్యవిగ్రహమువలె శ్యామలమూర్తివై అతని దక్షిణ బాహు వు నందలి చక్రమువలె మెరిసి,  ఎడమచేతిలోని శంఖమువలె ఉరుమి శార్ఙ్గమునుండీ వెలువడు బాణమువలె లోకమంతయూ సంతోషించునట్లు ~ మేము ఆనందముగా స్నానము చేయునట్లు వర్షింపుము.
 
మేఘము అనగా ఆచార్యులు;  భగవంతునికంటే ఆచార్యులకు కారుణ్యము అధికము. ఆచార్యుడు సులభశైలిలో రెండు విధములుగా శిష్యులకు భోధిస్తారు;  
ఆశ్రయణ సౌకర్యాపాదక గుణములు (భగవంతుడు మనచే ఆశ్రయించుటకు అందుబాటులో ఉండువాడే అని తోచి ఆశ్రయించుటకు వీలు కల్పించు గుణములు);
 ఆశ్రిత కార్యాపాదక గుణములు (ఆశ్రయించినవారి కార్యములను చేయగలవాడు అనునట్లు స్పురింపజేయు గుణములు). 
ఆచార్యునకు జ్ఙానమే కాక తెలిసినది ఆచరించుటే మెరుపు. 
శంఖమువంటి ధ్వని అనగా ఆచార్యుడు చేయువేదఘోష. 
మేఘము వర్షించునట్లుగా ఆచార్యుడు భగవద్గుణాను భవమును వర్షించును.
వ్యాఖ్య:
 
ఆழிమழைక్కణ్ణా వర్షాధి దేవతయగు పర్జన్యుడా! వర్షాలు రాకపోతే సస్యాలు‌ లేవు; ప్రాణులకు తిండి ఉండదు. శ్రీమన్నారాయణుడు లోకరక్షణ
కర్తృత్వాన్ని వహిస్తే  సస్యాలను పండించుటకు కావలసిన వర్షాలను పర్జన్యుడు కురిపిస్తున్నాడు.  అటువంటి రక్షకా! 
వొన్ఱు నీ కై కరవేల్  నీవు కొంచమేని లౌభ్యము చూపక ఉదారముగా వానలు కురిపించు. అడిగిననూ అడుగకున్ననూపెట్టు స్వభావము నీదైననూ, దీనులకు అర్థించుట స్వభావము కనుక అడుగుతున్నాము.  ఆழிయుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి సాగరములో ఉన్న నీటిని త్రాగి మింటికెగిరి మాకు కావలసిన వానలను ఇవ్వు.  భక్తులకు సమస్తమూ భగవత్స్వరూపముగా గోచరించును కాన,  మేఘాలను విష్ణురూపునిగా వర్ణించుచున్నది గోదాదేవి ఈ పాశురములో. శ్రీమన్నారాయణుడు ఎలాగైతే తన శారంగమునుండీ భక్తులు శరణన్నచో, కొంచెమైనా ఆలస్యము చేయక భక్తరక్షణార్థమూ, దుష్టశిక్షణార్థమూ కాపాడినట్లు,  ఓ పర్జన్యా! నీవునూ జలధారాలను కురిపించినచో, మేమునూ 
మార్గళి నీరాడ మగిళిందు మార్గశీర్ష వ్రతమునకు పుష్కలోదకముల స్నానాలాడి ఆనందిస్తాము ~ అని అంటున్నదీ పాశురములోఆణ్డాళమ్మ, స్వార్థంగా ఉండక లోకోపకారము చేస్తే భగవానుడు సంతోషిస్తాడు కదా!
 
 
తిరుప్పావై నాలుగవ పాశురానికి‌ అనువాద సీస పద్యము
(రచయిత: కీ.శే. కుంటిమద్ది శేష శర్మ గారు):
 
కుంచించుకొనబోకు కొంచెమేనియు దాన
హస్తమో యన్న; వర్షాథినాథ!
కడలి లోనికి జొచ్చి కడుపార నీరాని
త్రేచి, నింగికి నెక్కి రేగి సాగి,
జగదాదికారణ శ్యామల విగ్రహా!
పద్మనాభుని దీర్ఘ బాహు యుగళి
సరియట్లు మెరపుల బరపుచు, వలమురి
కైవడి గంభీర గర్జ లెసగ!
 
పైరు పచ్చల జగతి సంపదలు పొదల
నాగ్రహాయణి మేము నీరాడి మురియు
శార్ఙ్గ కార్ముక నిర్గత శర విధాన
వాన గురియుము వేగ ననూనదాన!
(ఆణ్డాళ్ దివ్యతిరువడిగళే శరణమ్)
🌹🙏🌹🙏🌹🙏🌹

కామెంట్‌లు